MLC Kavitha in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. మంగళవారం దాదాపు 10 గంటలకుపైగా విచారించిన ఈడీ అధికారులు.. ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అంతకుముందు కవిత లాయర్ సోమా భరత్‌ను ఈడీ కార్యాలయానికి పిలిపించారు అధికారులు. కొన్ని కీలక డాక్యుమెంట్లు తెప్పించుకున్నట్లు సమాచారం. కవితకు సంబంధించిన ఆర్థరైజేషన్ సంతకాల కోసం పిలిపించినట్లు తెలుస్తోంది. తదుపరి విచారణకు కవిత స్థానంలో ఆయన హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇవాళ్టికి కవిత విచారణ ముగిసిందని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించి.. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సోమవారం కూడా కవితను దాదాపు 10 గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. రేపు ఈడీ విచారణ లేదని కవిత లీగల్ సెల్ టీమ్ వెల్లడించింది. తదుపరి విచారణ తేదీని త్వరలో మళ్లీ చెబుతామని ఈడీ అధికారులు చెప్పినట్లు పేర్కొంది.
బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యే ముందు ఎమ్మెల్సీ కవిత తన ఫోన్లను మీడియాకు చూపించింది. ఈడీ ఆరోపిస్తున్నట్లు తన ఫోన్లను ధ్వంసం చేయలేదంటూ ఆమె స్పష్టం చేసింది. తనపై కావాలనే ఈడీ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందంటూ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఈడీ అధికారి జోగేంద్రకు రాసిన లేఖ రాశారు. ఒక మహిళ ఫోన్ స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కల్గించదా..? అంటూ నిలదీశారు. తనను తొలిసారి ఈడీ మార్చి నెలలో విచారించిందని.. కానీ గతేడాది నవంబర్ నెలలోనే తాను ఫోన్లు ధ్వంసం చేసినట్లుగా ఈడీ ఆరోపించిందంటే అది దురుద్దేశపూర్వకంగా చేసిన తప్పుడు ఆరోపణలేనని అన్నారు.
మంగళవారం ఈడీ విచారణ ముగిసిన అనంతరం కవిత బయటకు వచ్చారు. ఎప్పటిలా చిరునవ్వుతో విక్టరీ సింబల్ చూసిస్తూ.. కార్యాకర్తలకు అభివాదం చేస్తూ కారులో ఎక్కారు. ఈడీ అధికారులు అడిగిన 10 ఫోన్లను కవిత అప్పగించగా.. ప్రధానంగా వాటి చుట్టే అధికారులు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సెల్‌ఫోన్లు కీలకమని వారు చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఈడీ కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ కవిత బయటకు రావడంతో బీఆర్ఎస్ వర్గాల్లో ఆనందం నెలకొంది. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read: 7th Pay Commission: ఉద్యోగుల జీతం పెంపు.. ఇన్‌కమ్ ట్యాక్స్ తగ్గింపు.. పార్లమెంట్‌లో కేంద్రం వివరణ
Also Read: MLC Kavitha: వరుసగా ఫోన్లను మార్చిన ఎమ్మెల్సీ కవిత.. రహాస్య వ్యవహారాల కోసమేనా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
MLC Kavitha ED Enquiry: ఊపిరిపీల్చుకున్న బీఆర్ఎస్ వర్గాలు.. ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ