మద్యానికి డబ్బు ఇవ్వలేదని తండ్రికి నిప్పంటించి చంపిన కొడుకు

son kills his father : తండ్రి ఒంటిపై నూనె (Oil) పోశాడు.. తర్వాత నిప్పు పెట్టి తగలబెట్టాడు. కాలిన గాయాలతో తండ్రి కేకలు వేయడంతో స్థానికులు ఆసుపత్రికి (Hospital) తీసుకెళ్లారు. కానీ బాధితుడు చికిత్స పొందుతూ మృతి (Died) చెందాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 02:18 PM IST
  • మద్యం మత్తులో తండ్రినే చంపిన కొడుకు
  • మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని కోపంతో తండ్రిని చంపేసిన కొడుకు
  • తండ్రి ఒంటిపై నూనె పోసిన నిప్పు పెట్టి తగలబెట్టిన కుమారుడు
 మద్యానికి డబ్బు ఇవ్వలేదని తండ్రికి నిప్పంటించి చంపిన కొడుకు

Denied money to buy alcohol son kills father to death: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన తండ్రినే చంపేశాడు. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని కోపంతో రెచ్చిపోయాడు. తండ్రి ఒంటిపై నూనె (Oil) పోశాడు.. తర్వాత నిప్పు పెట్టి తగలబెట్టాడు. కాలిన గాయాలతో తండ్రి కేకలు వేయడంతో స్థానికులు ఆసుపత్రికి (Hospital) తీసుకెళ్లారు. కానీ బాధితుడు చికిత్స పొందుతూ మృతి (Died) చెందాడు.

హైదరాబాద్‌ ఇంద్రానగర్‌లో (Indranagar) ఉండే కోటిపల్లి దుర్గారావు (55) (Durga Rao) ఓ ప్రైవేటు బ్యాంకులో గార్డెనింగ్‌ పని చేసేవారు. ఆయకు భార్య లక్ష్మి, నాగబాబు (Nagababu) (35), సూరిబాబు (33) ఇద్దరు కుమారులున్నారు. చిన్న కుమారుడు సూరిబాబు కుటుంబంతో పాటు బోరబండలో ఉంటున్నాడు. ఇక పెళ్లి కాని పెద్ద కుమారుడు నాగబాబు మద్యానికి బానిసయ్యాడు. అంతేకాదు రోజూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు. 

ఇక దుర్గారావు తన ఆరోగ్యపరిస్థితి (Health condition) బాగలేకపోవడంతో గత కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆయన భార్య కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇక పెద్దు కొడుకు నాగబాబు రోజూ మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులను వేధించేవాడు. తాజాగా కూడా ఫుల్‌గా మద్యం (Alcohol) తాగి వచ్చిన నాగబాబు.. తన తండ్రి దుర్గారావుతో గొడవపడ్డాడు. తనకు ఇంకా మద్యం కావాలని డబ్బులు ఇవ్వాలంటూ వేధించాడు. 

Also Read : CM KCR Maha Dharna LIVE Updates: మహాధర్నా అనంతరం సీఎం కేసీఆర్‌ పాదయాత్ర..

తన దగ్గర డబ్బుల్లేవని కొడుకుకు దుర్గారావుకు ఎంత చెప్పినా కూడా వినలేదు. దీంతో కోపంతో తండ్రిపై వంటనూనె పోశాడు కొడుకు. నిప్పుపెట్టి.. తలుపునకు గడియపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. దుర్గారావు కేకలు విన్న స్థానికులు వచ్చి ఉస్మానియా ఆసుపత్రికి (Osmania Hospital) తీసుకెళ్లారు. తాజాగా ఆయన మృతిచెందాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు (Case) దర్యాప్తులో ఉంది.

Also Read : దక్షిణాది అగ్రనటి నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News