MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ, ఈడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత అభ్యర్ధనను ఈడీ తిరస్కరించింది. విచారణకు హాజరుకావల్సిందేనని ఈడీ చెప్పడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన ప్రారంభమైంది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఆందోళన కల్గిస్తోంది. ఇటీవలే తొలి దశ ఈడీ విచారణను ఎదుర్కొన్న కవిత ఇవాళ మరోసారి విచారణకు హాజరుకావల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ఇవాళ్టి విచారణకు హాజరుకాలేనని, మరో తేదీ నిర్ణయించాలని కవిత ఈడీని కోరారు. తన న్యాయవాది సోమభరత్ కుమార్‌తో ఈడీకి ఈ మేరకు సమాచారం పంపించారు. అయితే కవిత అభ్యర్ధనను ఈడీ నిరాకరించిందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో కవిత ఈడీ విచారణకు హాజరౌతారా లేదా , ఒకవేళ కాకపోతే ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది.
ఈడీ విచారణపై స్టే కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పెండింగులో ఉన్నందున, అనారోగ్యం కారణంగా మార్చ్ 24 వరకూ సమయం ఇవ్వాలని కోరారు. ఈడీ మాత్రం కవిత అభ్యర్ధనను తిరస్కరించింది. ఈ నేపధ్యంలో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.
ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియో, రామచంద్రన్ పిళ్లై, బుచ్చిబాబుల కస్టడీ 1-2 రోజుల్లో ముగియనుంది. కవితను కూడా ఆరెస్టు చేసి అందర్నీ ఒకేసారి విచారించాలనేది ఈడీ ఆలోచనగా ఉంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ ముగిశాకే..విచారణకు హాజరుకావాలనేది కవిత ఆలోచనగా ఉంది. ఇవాళ్టి విచారణ విషయంలో కవిత హాజరుకాకపోతే ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
Also read: AP Mlc Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook