రేవంత్ ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు ; రూ.కోటితో పాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం ?

                          

Last Updated : Sep 28, 2018, 10:37 AM IST
రేవంత్ ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు ; రూ.కోటితో పాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం ?

హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.  ప్రస్తుతం ఐటీశాఖకు చెందిన మరో అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే రేవంత్ సోదరుడు కొండల్‌రెడ్డి ఇంట్లో సోదాలు ముగిశాయి. వీరితో పాటు ఓటుకు నోటు కేసుతో సంబంధమున్న సెబాస్టియన్, ఉదయ్‌సింహ ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం సెబాస్టియన్‌కి నోటీసులు ఇచ్చి.. సోమవారం లోపు సమాధానం ఇవ్వాలని పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు చేసిన దాడుల్లో రేవంత్ నివాసం నుంచి రూ.కోటితో పాటు కీలక డాక్యమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు మీడియాలో  కథనాలు ప్రసారమౌతున్నాయి. 

గురవారం ఉదయం ఐటీ అధికారులు రేవంత్ రెడ్డి సహా బంధువుల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కోండగల్ లో ఎన్నికల ర్యాలీలో రేవంత్ రెడ్డి.. విషయం తెలుసుకొని అర్థాతరంగా కార్యక్రమాన్ని ముగించుకొని హైదరాబాద్ కు వచ్చారు. అనంతరం ఆయన ఐటీ అధికారుల విచారణకు హాజరయ్యారు. రేవంత్‌రెడ్డిని 10 గంటల పాటు ఐటీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది.

Trending News