హైదరాబాద్: కరోనావైరస్ దెబ్బకు రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు ఒక్కసారి ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. లాక్డౌన్ (Lockdown) సమయంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మద్యంప్రియులు వైన్స్ తెరుచుకున్న తరవాత కొన్ని రోజుల్లోనే మద్యం అమ్మకాలు బాగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. కరోనావైరస్ భయంకరంగా వ్యాప్తిస్తుండటంతో దేశమంతటా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఉపాధి లేక జనాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అయితే బీర్ల అమ్మకాలు గత ఏడాది కంటే ఇప్పుడు 44 శాతం తగ్గాయని, పైగా ప్రభుత్వం మద్యం ధరలు కూడా పెంచడంతో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి.
Also Read: ఇమ్మ్యూనిటిని పెంచే సరికొత్త ఐస్ క్రీం..
మరోవైపు లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పెరగడం, మధ్యం ధరలు పెరగడం బీర్ల అమ్మకాలు తగ్గడానికి కారణమని ఎక్సైజ్ డిపార్ట్మెంట్, డిస్టిలరీలు వెల్లడించాయి. గత ఏడాది 2019 జూన్ ఒకటి నుండి 17 వరకు సుమారు 30 లక్షల 20 వేల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయని, ఈ ఏడాది 2020 జూన్ ఒకటి నుండి 17 తేదీ వరకు సుమారు 17 లక్షల కేసులు మాత్రమే అమ్మకాలు జరిగాయని అధికారికంగా వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 44 శాతానికి బీర్ల అమ్మకాలు పడిపోయాయని, బీర్ల అమ్మకాలు తగ్గడానికి కరోనా వైరస్ తో పాటు, ఆర్థిక పరిస్థితులు కూడా కారణమని ఎక్సైజ్ శాఖ పేర్కొంది.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..