Telangana Covid-19: రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గత కొన్నిరోజుల క్రితం 1500లకు పైగా.. రెండువేలకు చేరువలో నమోదైన కేసులు కాస్త.. వేయికి చేరువలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వారం నుంచి కొంత తగ్గుముఖం పట్టింది.

Last Updated : Nov 12, 2020, 09:16 AM IST
Telangana Covid-19: రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గత కొన్నిరోజుల క్రితం 1500లకు పైగా.. రెండువేలకు చేరువలో నమోదైన కేసులు కాస్త.. వేయికి చేరువలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వారం నుంచి కొంత తగ్గుముఖం పట్టింది. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసులతోపాటు.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. అయితే గత 24 గంటల్లో బుధవారం ( నవంబరు 11న) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో కొత్తగా 1,015 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు (3) మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Adah Sharma: అందంతో ఆకట్టుకుంటున్న ఆదా..

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,54,666 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,393 కి చేరింది. అయితే గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,716 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,35,950 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 17,323 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.65 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. ఇదిలావుంటే.. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా 40,603 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 12వ తేదీ వరకు మొత్తం 47,70,004 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  జీహెచ్ఎంసీ పరిధిలో 172 కేసులు నమోదయ్యాయి. అయితే.. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.. Also read: Kajal, Gautam honeymoon pics: హనీమూన్‌‌లో కొత్త జంట.. కాజల్, కిచ్లు

telangana corona cases bulletin

Trending News