Telangana Covid-19: రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతునే ఉంది. అయితే రెండు రోజల నుంచి రాష్ట్రంలో కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొన్నిరోజుల క్రితం 2 వేలకు పైగా నమోదైన కేసులు.. ఇటీవల 1500లకు చేరువలో నమోదై.. ఇప్పుడు 600లకు చేరువలోనే నమోదవుతున్నాయి.

Last Updated : Oct 26, 2020, 09:19 AM IST
Telangana Covid-19: రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతునే ఉంది. అయితే రెండు రోజల నుంచి రాష్ట్రంలో కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొన్నిరోజుల క్రితం 2 వేలకు పైగా నమోదైన కేసులు.. ఇటీవల 1500లకు చేరువలో నమోదై.. ఇప్పుడు 600లకు చేరువలోనే నమోదవుతున్నాయి. ఇటీవల కాలంలో 600లకు చేరువలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు కూడా ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ఆదివారం ( అక్టోబరు 25 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 582 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,31,834 కి చేరగా.. మరణాల సంఖ్య 1,311 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.  Also read: Onions at RS.35 Per KG: రైతుబజార్లలో రూ35కే ఉల్లి...ఎలా కొనుగోలు చేయాలి అంటే..

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,432 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,11,912 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 18,611 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 91.40 శాతం ఉండగా.. మరణాల రేటు 0.56 శాతం ఉంది. Also read: Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వంశీకు కరోనా

తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం 14,729 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో (అక్టోబరు 25వరకు) మొత్తం 40,94,417 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 174 కేసులు నమోదు కాగా.. నల్లగొండ జిల్లాలో 87 కేసులు, రంగారెడ్డి జిల్లాల్లో 55 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. 

telangana corona cases bulletin

 

 Also read: Tejashwi Yadav: సీఎం అభ్యర్థికి చేదు అనుభవం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News