Telangana Covid-19: రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నానాటికీ పెరుగుతునే ఉన్నాయి. ఉపశమనం గత కొన్నిరోజుల క్రితం 2వేలకు పైగా నమోదైన కేసులు.. కాస్త ఇప్పుడు భారీగా తగ్గుముఖం పట్టాయి. వారం నుంచి 1500లకు చేరువలోనే నమోదవుతున్న కేసులు కాస్త.. నిన్న వేయికి తక్కువగానే నమోదయ్యాయి.

Last Updated : Oct 25, 2020, 10:46 AM IST
Telangana Covid-19: రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నానాటికీ పెరుగుతునే ఉన్నాయి. ఉపశమనం గత కొన్నిరోజుల క్రితం 2వేలకు పైగా నమోదైన కేసులు.. కాస్త ఇప్పుడు భారీగా తగ్గుముఖం పట్టాయి. వారం నుంచి 1500లకు చేరువలోనే నమోదవుతున్న కేసులు కాస్త.. నిన్న వేయికి తక్కువగానే నమోదయ్యాయి. దీంతోపాటు రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు కూడా ప్రతిరోజూ గణనీయంగానే పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో శనివారం ( అక్టోబరు 24 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 978 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,31,252 కి చేరగా.. మరణాల సంఖ్య 1,307 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.   Also read: Dussehra 2020: శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి దర్శనం

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,446 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,10,480 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 19,465 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 91.01 శాతం ఉండగా.. మరణాల రేటు 0.56 శాతం ఉంది. Also read: Dussehra 2020: శమీ పూజ.. పాలపిట్ట దర్శనం ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా..?

తెలంగాణ వ్యాప్తంగా శనివారం 27,055 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 40,79,688 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 185 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 89 కేసులు, మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 86 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. 

telangana corona cases bulletin

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News