Telangana Covid-19: తాజాగా 1,436 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల క్రితం ప్రతిరోజూ రెండువేలకు పైగా నమోదైన కేసులు కాస్త.. 1500లకు చేరువలో నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయమేమిటంటే.. రికవరీ రేటు కూడా రాష్ట్రంలో భారీగా పెరుగుతోంది.

Last Updated : Oct 18, 2020, 11:11 AM IST
Telangana Covid-19: తాజాగా 1,436 కరోనా కేసులు

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల క్రితం ప్రతిరోజూ రెండువేలకు పైగా నమోదైన కేసులు కాస్త.. 1500లకు చేరువలో నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయమేమిటంటే.. రికవరీ రేటు కూడా రాష్ట్రంలో భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో శనివారం ( అక్టోబరు 17 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 6 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,22,111 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,271 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Navratri Day 2: ‘బాలా త్రిపురసుందరి’గా అమ్మవారి దర్శనం

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 2,154 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 1,98,790 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 22,050 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 249, రంగారెడ్డి జిల్లాలో 110, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 105 కేసులు నమోదు అయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి...

telangana corona cases bulletin

Also read:  India Covid-19: మళ్లీ వేయి మార్క్ దాటిన కరోనా మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News