Telangana Covid-19: కొత్తగా 1,451 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం రెండువేలకు పైగా నమోదైన కేసులు కాస్త.. కొన్ని రోజుల నుంచి 1500లకు చేరువలో నమోదవుతున్నాయి. అంతేకాకుండా రికవరీ రేటు కూడా రాష్ట్రంలో రోజురోజుకూ గణనీయంగా పెరుగుతూనే ఉంది.

Last Updated : Oct 17, 2020, 10:20 AM IST
Telangana Covid-19: కొత్తగా 1,451 కరోనా కేసులు

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం రెండువేలకు పైగా నమోదైన కేసులు కాస్త.. కొన్ని రోజుల నుంచి 1500లకు చేరువలో నమోదవుతున్నాయి. అంతేకాకుండా రికవరీ రేటు కూడా రాష్ట్రంలో రోజురోజుకూ గణనీయంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో శుక్రవారం ( అక్టోబరు 16 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,451 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,20,675 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,265 కి చేరింది. Also read: Navratri Day 1: స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,983 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 1,96,636 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 22,774 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 235, రంగారెడ్డి జిల్లాలో 104, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 101 కేసులు నమోదు అయ్యాయి.

Also read: Navratri 2020: అమ్మవారికి ఏ రోజు ఎలాంటి పూజలు జరగాలి ? ఘటస్తాపన ముహూర్తాలు ఏంటి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News