Telangana Coronavirus Updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో నిత్యం రెండువేలకు పైగా నమోదైన కేసులు కాస్త.. కొన్ని రోజుల నుంచి రెండువేలకు తక్కువగా నమోదవుతున్నాయి. అంతేకాకుండా రికవరీ రేటు కూడా రాష్ట్రంలో రోజురోజుకూ గణనీయంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( అక్టోబరు 15 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,554 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,19,224 కి చేరగా.. మరణాల సంఖ్య 1,256 కి పెరిగింది. Also read: TS PGECET 2020 Results: మధ్యాహ్నం పీజీఈసెట్ ఫలితాలు
ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,435 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 1,94,653 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 23,203 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 88.79 శాతం ఉండగా.. మరణాల రేటు 0.57 శాతంగా ఉంది. Also read: Rafale Aircraft: నవంబర్‌లో భారత్‌కు రెండో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు
అయితే.. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా గురువారం 43,916 కరోనా టెస్టులు చేయగా.. అక్టోబరు 15వ తేదీ వరకు రాష్ట్రంలో 37,46,963 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 249 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 128, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 118 కేసులు నమోదయ్యాయి. Also read: Naini Narsimha Reddy: నాయిని నర్సింహా రెడ్డి ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe