Telangana Covid-19: తాజాగా 1,378 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. అయితే.. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్న కేసులు కాస్తా రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి.

Last Updated : Sep 28, 2020, 09:57 AM IST
Telangana Covid-19: తాజాగా 1,378 కరోనా కేసులు

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. అయితే.. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్న కేసులు కాస్తా రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో ఆదివారం ( సెప్టెంబరు 27 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,378 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఏడుగురు మరణించారు. తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,211 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,107 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: TS EAMCET 2020: నేడు, రేపు ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 1,56,431 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 29,673 మంది చికిత్స పొందుతున్నారు. ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం 35,465 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 28,86,334 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 83.55 శాతం ఉండగా.. మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. నిన్న అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో కొత్తగా 254 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

telangana corona cases bulletin

Nizamabad Local Body MLC bypoll: కవిత విజయంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ధీమా

Trending News