Covid-19: తెలంగాణలో కొత్తగా 2,892 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నిత్యం కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

Last Updated : Sep 2, 2020, 09:40 AM IST
Covid-19: తెలంగాణలో కొత్తగా 2,892 కరోనా కేసులు

Telangana Covid-19 Cases: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నిత్యం కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే.. గత 24 గంటల్లో మంగళవారం ( సెప్టెంబరు 1న ) తెలంగాణలో కొత్తగా 2,892 కరోనా కేసులు నమోదు కాగా.. 10 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,30,589కి చేరగా.. ఇప్పటివరకు 846 మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Pawan Kalyan: వారి మరణం మాటలకు అందని విషాదం

ఇప్పటివరకు రాష్ట్రంలో 97,402 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 31,341 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.  ఇదిలాఉంటే.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 14,83,267 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలాఉంటే.. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీలో 477 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు.. ఇలా ఉన్నాయి.

telangana corona cases bulletin

Also read : పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో తీవ్ర అపశృతి.. ముగ్గురు అభిమానులు మృతి

Trending News