/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతునే ఉంది. రాష్ట్రంలో శనివారం, ఆదివారం భారీగా తగ్గిన కరోనా కేసులు సోమవారం మళ్లీ వేయికి చేరువలో నమోదయ్యాయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య.. రెండు రోజుల నుంచి భారీగానే పెరుగుతోంది. గత 24 గంటల్లో ( నవంబరు 16న ) రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా  కొత్తగా 952 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు (3) మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Bharat Biotech: కోవాక్సిన్ తుది దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా (Covid-19) పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,58,828కి చేరగా.. మరణాల సంఖ్య 1410 కి పెరిగింది. అయితే గత 24 గంటల్లో కరోనా నుంచి 1,602 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,43,686 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 13,732 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.14 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. Also read: Krithi Shetty: చూపులతో చంపేస్తున్న ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి

ఇదిలావుంటే.. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా 38,245 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 16వ తేదీ వరకు మొత్తం 49,29,974 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  హైదరాబాద్ పరిధిలో 150 కేసులు నమోదయ్యాయి. 

telangana corona cases bulletin

Also read: RRR Movie: చలికి వణుకుతున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. వీడియో వైరల్

Also read: Allu Arjun: అభిమానితో ఫొటోలు దిగిన పుష్పరాజ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Section: 
English Title: 
Coronavirus positive cases in telangana stands at 2,58,828 and 1,410 deaths
News Source: 
Home Title: 

Telangana Covid-19: 94శాతం దాటిన కరోనా రికవరీ రేటు

Telangana Covid-19: 94 శాతం దాటిన కరోనా రికవరీ రేటు
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Telangana Covid-19: 94 శాతం దాటిన కరోనా రికవరీ రేటు
Publish Later: 
No
Publish At: 
Tuesday, November 17, 2020 - 08:59