Covid-19: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో నిరంతరం కొత్త కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి.

Last Updated : Aug 23, 2020, 09:38 AM IST
Covid-19: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

Corona updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో నిరంతరం కొత్త కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గత 24గంటల్లో ( శనివారం ఆగస్టు 22) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,384 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 11మంది మరణించినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,249కు పెరగగా.. కరోనా మరణాల సంఖ్య 755కి చేరింది. Also read: Babri Masjid demolition case: బాబ్రీ కేసులో తీర్పునకు ‘సుప్రీం’ కొత్త డెడ్‌లైన్

ప్రస్తుతం తెలంగాణలో 22,908 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 80,586 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇదిలాఉంటే.. గడిచిన 24గంటల్లో 40,666 కరోనా టెస్టులను పరీక్షించినట్లు ప్రభుత్వం (Telangana govt) తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,31,839 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. గత 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 472 కేసులు నమోదుకాగా.. నిజమాబాద్‌ జిల్లాలో 148, రంగారెడ్డి జిల్లాలో 131, కరీంనగర్ జిల్లాలో 120 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు.. ఇలా ఉన్నాయి..

telangana corona cases bulletin

Also read: SangaReddy fire accident: సాల్వెంట్స్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం

Trending News