CoronaVirus Cases in Telangana: కొత్తగా 573 కరోనా కేసులు

CoronaVirus cases in Telangana: తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,724కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,630 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7,630 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Last Updated : Dec 13, 2020, 11:09 AM IST
  • కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం
  • తాజాగా 572 కొత్త కోవిడ్-19 కేసులు
  • కరోనా రికవరీ రేటు 96.71 శాతం
CoronaVirus Cases in Telangana: కొత్తగా 573 కరోనా కేసులు

CoronaVirus Cases in Telangana: తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న (శనివారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 573 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,724కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,630 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

నిన్న ఒక్కరోజే 47,386 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. దీంతో తెలంగాణ (Telangana)లో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,493కి చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 609 మంది చికిత్స అనంతరం కరోనా వైరస్ (CoronaVirus) నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 2,68,601 మంది కోలుకున్నారు. 

Also Read: Solar Eclipse 2020 Date and Timings: చివరి సూర్యగ్రహణం.. భారత్‌లో  పరిస్థితి ఏంటంటే!

తెలంగాణలో ప్రస్తుతం 7,630 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో 5,546 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. కరోనా రికవరీ రేటు జాతీయ సగటు కన్నా తెలంగాణ మెరుగ్గా ఉంది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 96.71 శాతం ఉండగా, జాతీయ సగటు 94.9శాతానికి చేరింది.

Also Read : Health Tips: రోగనిరోధక శక్తిని పెంచే 5 చిట్కాలు

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News