Telangana: కొత్తగా 2043 కరోనా కేసులు

ఎన్ని చర్యలు తీసుకుంటున్నా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు (Telangana Corona Positive Cases) భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా రెండు వేలకు పైగా కరోనా కేసులు నిర్ధారించారు. గురువారం రాత్రి 8 గంటల వరకు 2,043 తాజా కరోనా కేసులను నిర్ధారించినట్లు వైద్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 

Last Updated : Sep 18, 2020, 09:16 AM IST
  • తెలంగాణలో కొత్తగా 2,043 కరోనా కేసులు
  • రాష్ట్రంలో పెరిగిపోతున్న కరోనా వైరస్ వ్యాప్తి
  • తెలంగాణలో వెయ్యి దాటిన కరోనా మరణాలు
  • ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,67,046
Telangana: కొత్తగా 2043 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive cases in Telangana) నిత్యం 2 వేల వరకు నమోదవుతున్నాయి. గురువారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 2,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కోవిడ్19 కేసుల సంఖ్య (CoronaVirus cases in Telangana) 1,67,046కి చేరింది. గడిచిన 24 గంటల్లో 11 మంది కరోనాతో  చనిపోయారు. ఇప్పటివరకూ కోవిడ్19 బారిన పడి తెలంగాణలో 1016 మంది చనిపోయారు. Telangana Rains: మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు 

తెలంగాణలో మొత్తం కేసులకుగానూ చికిత్స అనంతరం కోలుకున్న వారి సంఖ్య 1,35,357కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 30,6733 యాక్టివ్ కేసులుండగా.. మరో 24,081 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణలో ఇప్పటివరకూ 23,79,950 (23 లక్షల 79 వేలు) శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు.. క్షీణించిన వెండి

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News