గన్ మిస్‌ఫైర్: కానిస్టేబుల్‌ తలలోకి దూసుకెళ్లిన తూటా

ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 23, 2020, 09:32 AM IST
గన్ మిస్‌ఫైర్: కానిస్టేబుల్‌ తలలోకి దూసుకెళ్లిన తూటా

తిర్యాని: ప్రమాదవశాత్తూ సర్వీస్ తుపాకీ పేలగా కానిస్టేబుల్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటన తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కిరణ్ తిర్యాని పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రమాదవశాత్తూ తుపాకీ పేలింది. కానిస్టేబుల్ కిరణ్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.

See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా

Also Read: టాలీవుడ్ దర్శకుడి ఇంట విషాదం..

ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావమైన కిరణ్‌ను చికిత్స నిమిత్తం బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తుపాకీ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. కానిస్టేబుల్ కిరణ్ స్వస్థలం మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని చౌటపల్లి.

See Photos: ఫొటోషూట్ కోసం టాప్ లేపిన ముద్దుగుమ్మలు!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News