Telangana Congress Plans: తెలంగాణ మిస్ కాకూడదు, రెండు ప్లాన్స్ సిద్ధం చేసిన కాంగ్రెస్

Telangana Assembly Election 2023 Results: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. అధికారం ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు ఆరంభించింది. కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ పర్యవేక్షణలో మిషన్ తెలంగాణ నడుస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 3, 2023, 07:30 AM IST
Telangana Congress Plans: తెలంగాణ మిస్ కాకూడదు, రెండు ప్లాన్స్ సిద్ధం చేసిన కాంగ్రెస్

Telangana Assembly Election 2023 Results: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపుతున్న క్రమంలో గెలిచిన ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ తగిన వ్యూహాలు సిద్ధం చేసింది. డీకే శివకుమార్ నేతృత్వంలో రెండు ప్లాన్లు అమలు చేయనుంది. 

తెలంగాణలో అధికారం మిస్ కాకూడదనే కృత నిశ్చయంతో ఉన్నా కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ముగిసేవరకూ , ముగిసిన తరువాత అనుసరించాల్సిన వ్యూహాల్ని సిద్దం చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం అప్పగించిన ఈ బాధ్యతను నెరవేర్చేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇతరులు హైదరాబాద్ చేరుకున్నారు. రాహుల్ గాంధీతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకూ అభ్యర్ధులు అక్కడే ఉండి ఫలితం అంచనాను బట్టి అక్కడ్నించి తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్ గాంధీ సైతం ఇదే సూచించినట్టు తెలుస్తోంది. 

ముఖ్యంగా మేజిక్ ఫిగర్‌కు అటూ ఇటూ వస్తే ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు ఇప్పట్నించే పార్టీ సిద్ధమౌతోంది. రెండు వ్యూహాల్ని అమలు చేయనుంది. మేజిక్ ఫిగర్ వస్తే ప్లాన్ ఎ, మేజిక్ ఫిగర్ లేకపోతే ప్లాన్ బి సిద్ధం చేయనుంది. స్పష్టమైన మెజార్టీ వస్తే అభ్యర్ధులందరినీ హైదరాబాద్ పిలిపించి డీకే సమక్షంలో సమావేశం జరపనున్నారు. తరువాత ముఖ్యనేతలతో కలిసి ఢిల్లీలో సీఎల్పీ తేదీ నిర్ణయిస్తారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత కూడా అధిష్టానం నిర్ణయం మేరకు ఉంటుంది. 

హంగ్ వంటి పరిస్థితులతో మేజిక్ ఫిగర్‌కు అటూ ఇటూ ఉంటే మాత్రం రెండవ ప్లాన్ అమలు చేయనుంది. గెలిచిన అభ్యర్ధుల్ని సాధ్యమైనంత త్వరగా బెంగళూరు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. గెలుపు ధృవీకరణ పత్రాలు తీసుకునేవరకూ ఆగకుండా ఆ పత్రాలు ఛీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు సేకరించేలా ఉంటే బాగుంటుందనే ఆలోచన ఉంది. ఎందుకంటే ప్రత్యర్ధులకు ఎలాంటి చిన్న అవకాశాన్ని ఇచ్చినా ఎమ్మెల్యేలు చేజారే అవకాశాలుంటాయనేది కాంగ్రెస్ పార్టీ భయం. ఎందుకంటే బీఆర్ఎస్ -బీజేపీ కలిసి ఎమ్మెల్యేల్ని హైజాక్ చేస్తారనే ప్రచారం ఉండటం వల్ల కాంగ్రెస్ ఎలాంటి అవకాశాన్ని ఇవ్వదల్చుకోవడం లేదు. 

ఒకవేళ మజ్లిస్ అవసరం ఏర్పడితే ఏం చేయాలనేదానిపై కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తోంది. మజ్లిస్ మద్దతు తీసుకోవడంలో ప్రజల్నించి గానీ ఇతరుల్నించి గానీ వచ్చే ఇబ్బందులేవీ ఉండకపోవచ్చనే ఆలోచన ఉంది. సుస్థిర ప్రభుత్వం కోసం ఈ నిర్ణయం తీసుకుంటే తప్పు లేదనే ఆలోచన కన్పిస్తోంది. 

Also read: Telangana Assembly Election 2023 Result Live: ఎన్నికల కౌటింగ్ లైవ్‌ అప్‌డేట్స్.. మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News