CM KCR Speech: తెలంగాణలో రాజకీయం ఊపందుకుంది. ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలు ఈ సమరంలో గెలవాలని.. గవర్నమెంట్ ఏర్పరచాలని ఆలోచనలో ఉన్నాయి. ఇక అధికార పార్టీ బీఆర్ఎస్ విషయానికి వస్తే అభ్యర్థుల ప్రకటన, ఎన్నికల డేట్ తరువాత ప్రజా గర్జన సభలు అంటూ బిజీ బిజీగా మారిపోయింది. ఈ రోజు సిరిసిల్లలో జరుగుతున్నా ప్రజా గర్జన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. సమైక్య పాలనలో మానేరు దుమ్ములేసేది. ఇపుడు మన స్వరాష్ట్ర పాలనలో అప్పర్ మానేరు మత్తడి దుంకే పరిస్థితి మనం చూస్తున్నాం.. కలలో అనుకున్న అభివృద్ధి ఇపుడు సిరిసిల్లలో కళ్లారా కనపడుతుంది. కేటీఆర్ సిరిసిల్లలో గెలిచిన తర్వాత చేనేతల కార్మికుల దశ మారింది. చేనేత కార్మికులు బ్రతకాలి.. వారి కుల వృత్తి మగ్గాలకు పని ఉండాలి.. చేనేత కార్మికులకు పని కల్చించే దృష్టితోనే బతుకమ్మ చీరలు పంపిణీ ప్రారంభించాం. బతుకమ్మ చీరలు చేనేత కన్నీరు తుడిచే పథకం. కానీ కొంత మంది బతుకమ్మ చీరలపై కూడా రాజకీయం చేస్తున్నారు. కొన్ని చోట్ల బతుకమ్మ చీరలు తగలబెట్టడం నీచాతినీచమని కేసీఆర్ అన్నారు.
నా 70 ఏండ్ల జీవితంలో వందలసార్లు సిరిసిల్లలో తిరిగాను ఇప్పడు మానేరు సజీవ జలధారగా మారింది. ఎండకాలంలో కూడా అప్పర్ మానేరు మత్తడి దూకుతోంది.. ఇవన్నీ చూస్తుంటే కడుపు నిండుతోంది. గతంలో సిరిసిల్ల ప్రాంతంలో గోడలపై రాతలు చూసి మనసు చలించేంది, అందుకే సిరిసిల్ల మరో షోలాపూర్‌గా మారాలన్నదే నా ధ్యేయం. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని గోడలపై రాతలుండేవి, బీఆర్ఎస్ పార్టీ తరుపున రూ. 50 లక్షలు ఇచ్చి చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకున్నాము.. ఆసరా పెన్షన్ రూ. 5 వేలకు పెంచాము.. రేషన్ ద్వారా సన్నబియ్యం ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా మారింది. కేటీఆర్ ఉండగా సిరిసిల్లకు ఏ లోటు ఉండదు, సిరిసిల్ల ఇంకా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తారట.. ధరణితో మీ భూమిపై హక్కులు మీకే ఇచ్చాం, మీ బొటన వేలు ముద్ర లేకుండా ఏ అధికారి ఏం చేయలేడు.. ఎవర్ని బంగాళా ఖాతంలో వేయాలో మీరే ఆలోచించండి.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ దళారీలు, పైరవీలు వస్తారు.
Also Read: Ap Government: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఫెయిల్ అయినా మళ్లీ పదో తరగతిలో చేరవచ్చు
తొమ్మిదిన్నరేళ్లలో దేశంలోనే అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా మారింది. మన రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సౌకర్యం కల్పిస్తున్నాం. కేసీఆర్ పట్టుదలతోనే తెలంగాణ రైతాంగానికి 24 గంటల కరెంటు అందిస్తున్నాం. 24 గంటల కరెంట్ అనేది ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో కూడా రాదు. చేతగాని కాంగ్రెస్ 60 ఏండ్లు పాలించి రాష్ట్రాన్ని అధోగతి పట్టించింది. అన్నిటి నుండి విముక్తి పొంది ఇపుడు అభివృద్ధి పథంలో ఉన్నాము. 10 ఏళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉంది, కులాల కొట్లాట లేదు.. మాతాల మధ్య ఘర్షణలు లేవు. గంగా, యమునా, తెహజీబ్‌లా రాష్ట్రంలో అందరూ కలిసి మెలిసి ఉన్నారు. మన రాష్ట్రంలో హిందూ- ముస్లింల మధ్య గొడవలు సృష్టించే దుర్మార్గులు ఉన్నారు. రాష్ట్రంలో అందరూ అన్నాదమ్ముల్లా ఉన్నామని కేసీఆర్ పేర్కొన్నారు.
Also Read: Cricket in Olympics: వందేళ్ల తరువాత 2028లో తిరిగి ఒలింపిక్స్‌లో క్రికెట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి