Yadadri CM KCR:యాదాద్రి సన్నిధిలో మహాకుంభాభిషేక మహోత్సవం..!

Yadadri CM KCR:యాదాద్రి సన్నిధిలో రామలింగేశ్వర స్వామి మహాకుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. మహాకుంభాభిషేక మహోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా యాదాద్రి అనుబంధ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2022, 03:34 PM IST
  • యాదాద్రి సన్నిధిలో మహాకుంభాభిషేక మహోత్సవం
  • రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రారంభోత్సవం
  • ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్ దంపతులు
Yadadri CM KCR:యాదాద్రి సన్నిధిలో మహాకుంభాభిషేక మహోత్సవం..!

Yadadri CM KCR:యాదాద్రి సన్నిధిలో రామలింగేశ్వర స్వామి మహాకుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. మహాకుంభాభిషేక మహోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా యాదాద్రి అనుబంధ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం ప్రధానాలయాన్ని పునర్‌ప్రారంభించారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా ఉద్ఘాటన జరిగింది. 

ఆ తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకముందు ఎర్రవల్లి నుంచి రోడ్డుమార్గంలో ఆలయానికి చేరుకున్న సీఎం దంపతులకు ఘనస్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతించారు. ఉదయం 10.25 గంటలకు ధనిష్ఠా నక్షత్ర సుముహూర్తాన తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో సపరివార రామలింగేశ్వర స్పటికలింగ ప్రతిష్ఠ నిర్వహించారు. 

అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, ప్రతిష్ఠాంగ హోమం, అఘోర మంత్రి హోమం, దీగ్ధేవతాక్షేత్రపాల బలిహరణం, శోభాయాత్ర, కలశప్రతిష్ఠ కార్యక్రమాలు చేపట్టారు. శివాలయ మహాకుంభాభిషేకంలో మధ్యాహ్నం మహా పూర్ణాహుతి, అవబృధం నిర్వహించారు. అనంతరం స్వామి వారి అనుగ్రహ భాషణం చేపట్టారు. ఆ తర్వాత మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ, ప్రతిష్ఠాయాగ పరిసమాప్తి పలికారు. 

సీఎం కేసీఆర్(KCR) వెంట మంత్రులు జగదీష్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, విప్, గొంగిడి సునీత, జెడ్పీ ఛైర్మన్ సందీప్‌రెడ్డి, సీఎంవో భూపాల్‌రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. సీఎం టూర్ సందర్భంగా యాదాద్రిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. 
 

Also read: World Malaria Day 2022: మలేరియా దినోత్సవం సందర్భంగా స్పెషల్‌ స్టోరీ..మలేరియా లక్షణాలు, నివారణ చర్యలు

Also read: PM Ujjwala Yojana: పీఎం ఉజ్వల యోజన స్కీమ్ సూపర్ సక్సెస్... ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News