లాక్డౌన్ (LockDown) సమయం కొందరు బాలికల పాలిట శాపంగా మారింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తీసుకొచ్చిన లాక్డౌన్ సమయంలో తెలంగాణలో (TELANGANA) ఇదే జరిగింది. లాక్ డౌన్ సమయంలో సాంఘిక దురాచారాలు ఒక్కసారిగా పెరిగాయి. కరోనాతో పోరాడి ఓడిన సీనియర్ వైద్యుడు..
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ (Telangana State Commission for Protection of Child Rights) వెల్లడించిన వివరాలు నిర్ఘాంతపరుస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో ఒకటి, రెండు కాదు.. ఏకంగా 204 బాల్య వివాహాలు ( CHILD MARRIAGES ) తెలంగాణ రాష్ట్రంలో జరిగాయి. మార్చి నెల 24 నుంచి మే 31 వరకూ ఈ బాల్యవివాహాలు జరిగనట్టు కమిషన్(TSCPCR ) తెలిపింది. పోలీస్ అకాడమీలో 180 మందికి కరోనా పాజిటివ్
కోవిడ్-19 వైరస్ ( COVID19 ) కారణంగా దేశమంతా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనతో లాక్డౌన్లోకి వెళ్లింది. ఇంతటి విపత్కర సమయంలో కూడా కొంతమంది సాంఘిక దురాచారాల్ని కొనసాగించారు. రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల్లో మొత్తం 204 బాల్యవివాహాలు జరిగినట్టు కమిషన్ దృష్టికి వచ్చింది. ఈ మేరకు బాలల హక్కుల కమిషన్ మీడియాకు వివరాలు వెల్లడించింది. సంబంధిత అధికారులు వీటిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని జిల్లా కలెక్టర్లకు ( DISTRICT COLLECTORS AND MAGISTRATES ) కమిషన్ సూచించింది. ప్రివెన్షన్ ఆఫ్ ఛైల్డ్ మ్యారెజేస్ యాక్ట్-2006 ప్రకారం తక్షణం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ డిమాండ్ చేసింది.
సాంఘిక దురాచారాల్ని మరీ ముఖ్యంగా బాల్యవివాహాల్ని అరికట్టాల్సిన అసవరం ప్రతి ఒక్కరిపై ఉందని, లేకపోతే సమాజంలో ఇది తీవ్ర ప్రబావం చూపిస్తుందని కమిషన్ అభిప్రాయపడింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ