Target KCR: కాళేశ్వరం ప్రాజెక్ట్ లెక్క తేలుస్తున్న సెంట్రల్ టీమ్స్.. కేసీఆర్ కు జైలు రూమ్ సిద్ధమవుతోందా?

Target KCR: జేపీ నడ్డా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి మాట్లాడటంతో కేంద్రం నుంచి ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కొన్ని రోజులుగా తెలంగాణలో మకాం వేసిన కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో పాటు కాగ్ టీమ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ చేసిందని చెబుతున్నారు

Written by - Srisailam | Last Updated : Aug 28, 2022, 10:42 AM IST
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఫోకస్
  • అన్ని లెక్కలు తేలుస్తున్న కాగ్
  • కేసీఆర్ కు ఉచ్చు బిగిస్తోందా?
Target KCR: కాళేశ్వరం ప్రాజెక్ట్ లెక్క తేలుస్తున్న సెంట్రల్ టీమ్స్.. కేసీఆర్ కు జైలు రూమ్ సిద్ధమవుతోందా?

Target KCR: కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం.. అన్ని లెక్కలు తేలుస్తాం.. ఇది హన్మకొండ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్టేట్ మెంట్. గత ఎనిమిది ఏళ్లుగా కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్న అవినీతిని కక్కిస్తాం.. ఇది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటన.. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అయితే కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం.. ఆయన కోసం జైలు రూమ్ సిద్దం చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కు జైలుకు వెళ్లడం ఖాయమని చాలా రోజులుగా సంజయ్ చెబుతున్నా... హన్మకొండ సభలో చేసిన ప్రకటన మాత్రం కొంత భిన్నంగా ఉంది. జేపీ నడ్డా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి మాట్లాడటంతో కేంద్రం నుంచి ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలను అనుగుణంగానే తెలంగాణలో కీలక పరిణామాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కొన్ని రోజులుగా తెలంగాణలో మకాం వేసిన కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో పాటు కాగ్ టీమ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ చేసిందని చెబుతున్నారు. ప్రాజెక్టు డిజైన్ మొదలుకుని.. నిర్మాణాలు, ఖర్చు, ఒప్పందాలు.. ప్రాజెక్టు ప్రయోజనాలు సహా మొత్తం అన్ని వివరాలను సెంట్రల్ టీమ్స్ సేకరిస్తున్నాయని తెలుస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులను గత  ఏప్రిల్ లో కాగ్ పరిశీలించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలు, ఖర్చు, ప్యాకేజీల వారీగా నిధుల వ్యయాలను సేకరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదటి అంచనా ఎంత.. తర్వాత ఎంతకు పెరిగింది.. ఎందుకు పెరిగిందనే వివరాలను కూడా కాగ్ టీమ్ తీసుకుందట.  మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌‌ను పరిశీలించిన అధికారుల బృందం... నిర్మాణ వ్యయం, మోటార్లు, పంపులు, ఇతర హైడ్రో ఎలక్ట్రికల్‌‌ పరికరాల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను తీసుకుందట. కేసీఆర్ సర్కార్ చేపట్టిన మూడో టీఎంసీ ఎత్తిపోతల పనులపైనే కాగ్ టీమ్స్ ఎక్కువగా ఫోకస్ చేశాయని తెలుస్తోంది. తాజాగా కాగ్​ నుంచి ఇరిగేషన్ అధికారులకు లేఖ వచ్చిందని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని వివరాలు అడిగినట్లు తెలిసింది. భూ నిర్వాసితులకు పరిహారం, ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ ప్యాకేజీ, ఇప్పటివరకు చెల్లించిన పరిహారం, ఇంకా ఎంత భూమి సేకరించాల్సి ఉందనే వివరాలు కావాలని కోరిందట. మూడో ‌ టీఎంసీ అంచనా వ్యయం, పనుల పురోగతి, మూడో టీఎంసీతో కలిగే ప్రయోజనాలు కూడా కాగ్ బృందం అడిగిందట. కాళేశ్వరం ప్రాజెక్టు కు తెలంగాణ  ప్రభుత్వం  చేసిన అప్పు అక్షరాలా 97, 447కోట్లుగా తేలింది. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ పేరుతో వివిధ బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భారీగా అప్పులు ఇచ్చాయి.

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రాణహిత చేవెళ్ల నుంచి రీడిజైనింగ్ చేశారు. రీడిజైనింగ్ ఎందుకు చేశారు.. పాత ప్రాజెక్టుకు, కాళేళ్వరం ప్రాజెక్టుకు తేడా ఎంటీ.. ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయా అన్న వివరాలను కూడా కాగ్ టీమ్ ఆరా తీస్తోందని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు, ప్రాణహిత డీపీఆర్‌‌, సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌‌ వచ్చిందా? ఇతర శాఖల అనుమతులు ఏమైనా వచ్చాయా? అనే వివరాలను కూడా కాగ్ సేకరించిందని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీర్ల నుంచి కూడా కాగ్ అధికారులు వివరాలు తీసుకున్నారని తెలుస్తోంది. ఇంజినీర్లు చెప్పిన సమాచారంలో ఏమైనా సందేహాలు వస్తే సమగ్ర వివరాలు కావాలని అడుగుతున్నారట. మొదట ఆమోదించిన డిజైన్లు, తర్వాత జరిగిన మార్పులు, విద్యుత్తు ఖర్చు వంటి అన్ని వివరాలను కాగ్ తో పాటు సీడబ్ల్యూసీ అధికారులు లోతుగా అధ్యయనం చేస్తున్నారని సమాచారం. అనేక ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టకపోవడం, అధిక మొత్తంలో రెవెన్యూ ఖర్చు, ఆర్థిక నిర్వహణ ఇలా అనేక అంశాలు కాగ్‌ పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టులో హైదరాబాద్ కు తాగునీటి సరఫరా కూడా ఉంది. దీంతో కాళేశ్వరం నుంచి హైదరాబాద్ కు నీటిని ఎలా సరఫరా చేస్తారు.. ఆ పనులు ఎంతవరకు వచ్చాయి.. హైదరాబాద్ కోసం రిజర్వాయర్లు నిర్మిస్తున్నారా... వాటి నిర్మాణం ఎంతవరకు వచ్చింది అనే వివరాలను కూడా కాగ్ టీమ్స్ సేకరిస్తున్నాయని తెలుస్తోంది. కేంద్ర సంస్థల దూకుడుతో కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంగా కేసీఆర్ సర్కార్ ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు దారిమళ్లాయని భావిస్తున్న కేంద్రం.. వాటి లెక్కలు తీసే పనిలో ఉందంటున్నారు. పక్కా ఆధారాలు సేకరించాకా కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి చిట్టా బయటపట్టే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర సర్కార్ పక్కాగా స్కెచ్ వేసిందని కాబట్టే తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని పదేపదే చెబుతున్నారని అంటున్నారు. మొత్తంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక, సంచలన పరిణామాలు జరిగే అవకాశం ఉందంటున్నారు.

Read Also: Noida Twin Towers: నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత నేడే.. 9 సెకన్లలో నేలమట్టం.. ఎలా కూల్చనున్నారు.. అసలెందుకు కూలుస్తున్నారు..!  

Read Also: IND vs PAK: ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు.. కార్తీక్, బిష్ణోయ్‌కు అవకాశం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News