CM KCR Convoy: సీఎం కేసీఆర్ కాన్వాయ్ కారు ట్రాఫిక్ చలానా

Traffic Challan | హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారి పట్ల ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలియజేసేందుకు ఈ ఘటనను ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లోని TS 09 K 6666 నెంబర్ గల ల్యాండ్ క్రూజర్ ప్రాడో కారుకు వేర్వేరు చోట్ల వేర్వేరు సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధించారు.

Last Updated : Jun 24, 2020, 02:35 AM IST
CM KCR Convoy: సీఎం కేసీఆర్ కాన్వాయ్ కారు ట్రాఫిక్ చలానా

Traffic Challan | హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ ( Traffic rules) అతిక్రమించిన వారి పట్ల ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలియజేసేందుకు ఈ ఘటనను ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లోని TS 09 K 6666 నెంబర్ గల ల్యాండ్ క్రూజర్ ప్రాడో కారుకు వేర్వేరు చోట్ల వేర్వేరు సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధించారు. 

హైదరాబాద్, సైబరాబాద్, సూర్యాపేట పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకు ట్రాఫిక్ పోలీసులు ఈ కారుపై నాలుగుసార్లు ఛలానా విధించారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణించినందుకు గాను ఈ చలానాలు విధించినట్టు ట్రాఫిక్ విభాగానికి ( Hyderabad Traffic police) చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సీఎం కార్యాలయం అధికారులు ట్రాఫిక్ పోలీసులపై గౌరవాన్ని చాటుకుంటూ కారుపై ఉన్న ఛలానా మొత్తాన్ని రూ. 4,140 ను చెల్లించారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News