BRS Party: ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ మల్లెపువ్వులాగా బయటకు వస్తాడని బీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది. కడిగిన ముత్యంలాగా కేటీఆర్ బయటకు వస్తారని తెలిపింది. కేటీఆర్ కేసు వ్యవహారంలో చోటుచేసుకున్న పరిణామాలన్నీ రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా.. కుట్ర రాజకీయాలు అని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. ఆఖరకు న్యాయం గెలుస్తుందని ప్రకటించారు.
Also Read: KT Rama Rao: నాకు ఉరిశిక్ష పడ్డట్టు కాంగ్రెసోళ్ల సంబరాలు ఎందుకు? నేను అవినీతి చేయలేదు
హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ రద్దు అనంతరం జరిగిన పరిణామాలపై బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కేటీఆర్‌పై కుట్ర రాజకీయాలు చేస్తున్నాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఎన్ని డ్రామాలు ఆడినా.. కేసులు పెట్టినా కేటీఆర్ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని ప్రకటించారు.
Also Read: HMPV Precautions: చైనా వైరస్‌పై తెలంగాణ సంచలన నిర్ణయం.. ఇకపై నో షేక్ హ్యాండ్స్
డైవర్ట్ పాలిటిక్స్
'రైతు భరోసాను పక్కదారి పట్టించడానికి రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని మాట తప్పారు. ఈ విషయాన్ని రైతుల్లోకి వెళ్లకుండా రేవంత్ రెడ్డి ప్లాన్ చేశాడు. ప్రభుత్వ దుర్మార్గులపై పోరాటం చేస్తుంటే కేసులు పెట్టీ క్షణిక ఆనందం పొందుతున్నారు. కేటీఆర్ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం. ఫార్ములా ఈ రేస్ కేసులో చట్టాన్ని రేవంత్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నాడు. అంతిమంగా న్యాయం గెలుస్తుంది. కేటీఆర్ నిర్దోషిగా.. మల్లెపువ్వులాగా.. కడిగిన ముత్యం లాగా బయటకు వస్తాడు' అని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.
రేవంత్ రెడ్డి బొక్కబోర్లా పడతాడు
'ఈ ఫార్ములా రేస్ కేసులో రేవంత్ రెడ్డి బొక్క బోర్లాపడడం ఖాయం. పాలనలో అట్టర్ ప్లాప్ కావడంతోనే రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ప్రభుత్వ చేతగానితనం బయటపడుతుందని కేటీఆర్‌పై కేసులు పెడుతున్నాడు. ఈ తతంగమంతా ప్రజల దృష్టిని మళ్లించేందుకే. ఈ కేసులో పస లేదు కాబట్టే ఎలక్టోరల్ బాండ్స్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. రేవంత్ రెడ్డి కుట్రలను చేధించుకొని కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకు వస్తారు' అని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేములవాడ ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.