KCR in Aashirwada Sabha: పాలమూరు పాలుగారే బంగారు తునకగా మారుతుంది: CM కేసీఆర్

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా జడ్చర్ల ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మాట్లాడారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2023, 07:32 PM IST
KCR in Aashirwada Sabha: పాలమూరు పాలుగారే బంగారు తునకగా మారుతుంది: CM కేసీఆర్

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చాలా యాక్టిక్ గా పాల్గొంటున్నారు. ఈ రోజు జరుగుతున్న జడ్చర్ల ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ..  "గత ఉద్యమ సందర్భంలో మహబూబ్ నగర్ జిల్లా ఏ మూలకు పోయినా, ఏ ప్రాంతానికి పోయినా ఎప్పుడు కూడా దు:ఖంతో తిరిగి పోయేది. కండ్లల్లో నీళ్లొచ్చేది.. ఆ రోజుల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ బతికి ఉండే. నాతో పాటు తిరుగుతుండేవారు. మహబూబ్ నగర్ దరిద్రం పోవాలంటే కచ్చితంగా మీరు ఎంపీగా పోటీచేయాలని  జయశంకర్ సార్  చెప్పారు. ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు. గెలిపిస్తారని జయశంకర్ సార్ నాకు చెప్తే ఇదే జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసాను. లక్ష్మారెడ్డి ముందుండి  పార్లమెంటు ఎన్నికను భుజాల మీద వేసుకుని  ఎంపీగా నన్ను గెలిపించాడు. 15 ఏండ్లు పోరాటం చేసినప్పటికీ నేను  మహబూబ్ నగర్ ఎంపీగా ఉంటూనే తెలంగాణను సాధించిన కీర్తి చిరస్థాయిగా మహబూబ్ నగర్ కు ఉంటుంది. 

జయశంకర్ గారు.. నేను నారాయణ పేట ప్రాంతం పోయి హైదరాబాద్ కు వెళ్లడానికి నవాబ్ పేట మీదుగా అటవి గుండా వస్తున్నాం. అక్కడ అటవిని చూసి.. మనుషులు కాదు చివరికి అడవి కూడా బక్కపడిపోయిందని..  సన్నగా ఉన్న చెట్లను చూసి జయశంకర్ నేను బాధపడ్డాం. మహబూబ్ నగర్ లో గంజి కేంద్రాలు పెడుతుంటే, అంబలి కేంద్రాలు పెడుతుంటే గుండెలవిసేలాగా మాకు బాధ కలిగేది. ఏం దుర్గతి  కృష్ణానది పక్కనుంచే పారుతున్నా.. అవకాశాలు ఉన్నా కూడా ముఖ్యమంత్రులు రావడం, దత్తత తీసుకోవడం , నాటకాలాడటం, శిలాఫలాకాలెయ్యడం తప్ప ఉమ్మడి రాష్ట్రంలో లాభం జరుగలేదు. 

ఉద్యమంలో నేను పాట కూడా రాసా.. పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయే.. పాలమూరు నల్లగొండ ఖమ్మంమెట్టు పంటలెండె అని రాశాను. మహబూబ్ నగర్ నా గుండెల్లో ఉంటది. ఇక్కడ దు:ఖం.. బాధ.. పేదరికం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం వచ్చాక లక్ష్మారెడ్డి సహచరుడిగా.. క్యాబినెట్ మంత్రిగా ఉన్నపుడు.. వైద్యశాఖ మంత్రిగా ఉండి చాలా పనులు చేశారు.  ఇయ్యాల వచ్చిన డయాగ్నిసిస్ సెంటర్లు. డయాలసిస్ సెంటర్లు  లక్ష్మారెడ్డి పుణ్యమేనని కేసీఆర్  పేర్కొన్నారు. 

Also Read: పండుగ సీజన్‌ సేల్‌ ప్రారంభం..43, 55, 65 అంగుళాల టీవీలపై 50% వరకు తగ్గింపు!

గోరేటి వెంకన్న ఇదే జిల్లా కవి పల్లెపల్లెలో పల్లేర్లు మొలిసి పాలమూరులోన అని పాటలు రాశారు. పల్లెపల్లెల్లో పల్లేర్లు మొలవాలెనా.. పల్లేర్లు మొలవాలనా అని, దీని కోసమేనా పుట్టింది అని పిడికిలెత్తి పోరాటం చేస్తే, అందరూ దీవెన ఇస్తే అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది . తెలంగాణ ఎవ్వరూ పుక్కానికి ఇవ్వలే. అనేకమందిని బలి తీసుకుని విద్యార్థులను చావగొట్టి, చాలా బాధలు పెట్టి చివరకు నేను కూడా ఆమరణ దీక్ష పట్టి చావునోట్లో తలకాయపెడితే తప్ప తెలంగాణ రాలేదు. ఎవడో ఇవ్వలే తెలంగాణ..? ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్సు. 60 ఏండ్లు గోసపోసుకుని మనం బొంబాయి పోయేటట్టు కూలీ పనేటట్టు, వలస పోయేటట్టు పోసింది కాంగ్రెస్ పార్టీ.

మళ్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్లే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మనమే పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించాం. ఇదే జిల్లాలో పుట్టిన దరిద్రులు, కాంగ్రెస్ నాయకులు పాలమూరు ఎత్తిపోతల పథకంపై కేసులు వేస్తున్నారు. అడ్డం పడ్తున్నారు..  అది పూర్తవ్వద్దని ప్రయత్నిస్తున్నారు. అది పూర్తయితే లక్ష్మారెడ్డికి, శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఎమ్మెల్యేలకు మరియు కేసీఆర్ కు పేరు వస్తదని అడ్డంకులు పెడుతున్నారు. అయినప్పటికీ మొండి పట్టుదలతో పోయినం. ఈ మధ్యనే  తొమ్మిది సంవత్సరాల పోరాటం తర్వాత అనుమతులన్నీ ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. ధర్మం, న్యాయం గెలుస్తుంది.. మొన్ననే పాలమూరు  ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది.. దానిమీద రావాల్సిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ఉద్దండపూర్ కావచ్చు. రిజర్వాయర్లు, టన్నెల్స్ పూర్తయ్యాయి..మోటర్లు బిగుస్తున్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో అన్ని రిజర్వాయర్లల్లో నీళ్లు కండ్ల చూడ బోతున్నాం. పాలమూరు కరువు అనేది పోతుంది. 

ఈ సభకు మంత్రి శ్రీనివాస గౌడ్, పార్లమెంటు సభ్యులు మన్నె శ్రీనివాస రెడ్డి,  ఎమ్మెల్సీలు సి. వెంకట్రామిరెడ్డి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్,  ఎమ్మెల్యేలు సీహెచ్.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Also Read: Allu Arjun: అసలు పుష్ప సినిమా కథ నేషనల్ అవార్డు టీం వారికి పూర్తిగా అర్థమైందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

Trending News