Kavitha: తన జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఆశీర్వాదం పొందారు. పుట్టినరోజు సందర్భంగా కవితను ఆశీర్వదించిన కొన్ని నిమిషాలకే కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్‌కు కొత్త వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లు కవితనే పోటీ చేస్తుందని జరుగుతున్న వార్తలకు చెక్ పట్టింది.
Also Read: BRS Party: బీఆర్ఎస్ పార్టీ సంచలనం.. వారిని కాదని వీరికి నాలుగు టికెట్లు కేటాయింపు మరి గెలుస్తారా?
లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించిన గులాబీ దళపతి కేసీఆర్ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లపై సమీక్షలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాలవారీగా సమీక్షలు చేస్తూ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అలా ఇప్పటివరకు 9 మంది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా ప్రకటించిన జాబితాలో కవిత ఆశిస్తున్న నిజామాబాద్ కూడా ఉంది. ఆ స్థానం నుంచి పార్టీ సీనియర్ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్‌కు అవకాశం ఇచ్చారు. ఆ సెగ్మెంట్ నుంచి అనూహ్యంగా కవితను పక్కకు జరపడం విస్మయానికి గురి చేసింది.
Also Read: KCR Speech: టీవీ ముందు కూర్చుంటా.. రేవంత్ రెడ్డి తాట తీస్తా: కేసీఆర్ సంచలన ప్రకటన
తెలంగాణ ఉద్యమంలో కవిత కూడా చురుకైన పాత్ర పోషించింది. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో జరిగిన ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. రెండోసారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేయగా కుమ్మక్కు రాజకీయాలతో ఓడిపోయారు. దీంతో ఆమెను కేసీఆర్ శాసనమండలికి ఎంపిక చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని కవిత ఎప్పటినుంచో ప్రణాళిక వేసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్లో పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. కవిత పనితనంతో పార్టీకి కొన్ని స్థానాలు లభించాయి.
నిజామాబాద్ పార్లమెంట్లో పోటీ చేసేందుకు ఒక వ్యూహం రచించుకున్నారు. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎంపీ అయిన ధర్మపురి అరవింద్‌తో కవిత యుద్ధమే చేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ విషయంలో అరవింద్ చేసిందేమీ లేదని కవిత నిలదీస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధిపై ఇద్దరి మధ్య సవాళ్లు జరుగుతున్నాయి. ఈసారి ఎలాగైనా అరవింద్‌ను ఓడించాలనే పట్టుదలతో కవిత ఉన్నారు. గెలిచేందుకు ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో విస్తృతంగా పర్యటిస్తూ కవిత బిజీబిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ అనూహ్యంగా నిజామాబాద్ నుంచి బాజిరెడ్డిని ప్రకటించడం విస్మయానికి గురి చేస్తోంది. కవిత పోటీ లేకపోవడంతో నిజామాబాద్‌లో పోరు అంతగా రక్తికట్టడం లేదు.
కవితకు టికెట్ నిరాకరణ వెనుక చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. మద్యం కుంభకోణం ప్రధానంగా ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు కుటుంబ పాలన ముద్ర నుంచి బయటపడేందుకు బాజిరెడ్డికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు నేర్పిన పాఠంతో కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా కవిత పోటీకి దూరంగా ఉండడం లేదనే విషయం రాజకీయ వర్గాలకు మింగుడు పడని విషయం. అరవింద్ కూడా కవితతోనే పోటీ అనుకున్నారు. మరి బీఆర్ఎస్ వేసిన పాచిక పారుతుందో లేదో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి