Black Fungus in Hyderabad: హైదరాబాద్‌లో బ్లాక్ ఫంగస్, కరోనా బాధితుల్లో ఆందోళన

Black Fungus in Hyderabad: కోవిడ్ 19 మహమ్మారి మరో కొత్త కష్టాన్ని తెచ్చిపెడుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్నామనే ఆనందం  లేకుండా పోతోంది. బ్లాక్ ఫంగస్ రూపంలో భయపెడుతోంది. అజాగ్రత్తగా ఉంటే ఇదీ ప్రాణాంతకమేనంటున్నారు వైద్యులు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 11, 2021, 01:54 PM IST
Black Fungus in Hyderabad: హైదరాబాద్‌లో బ్లాక్ ఫంగస్, కరోనా బాధితుల్లో ఆందోళన

Black Fungus in Hyderabad: కోవిడ్ 19 మహమ్మారి మరో కొత్త కష్టాన్ని తెచ్చిపెడుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్నామనే ఆనందం  లేకుండా పోతోంది. బ్లాక్ ఫంగస్ రూపంలో భయపెడుతోంది. అజాగ్రత్తగా ఉంటే ఇదీ ప్రాణాంతకమేనంటున్నారు వైద్యులు.

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ధాటికి దేశం అల్లాడుతోంది. భారీగా కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ బారిన పడి కోలుకున్నవారికి ఇప్పుడు మరో ముప్పు వెంటాడుతోంది. కరోనా నుంచి కోలుకున్నామన్న ఆనందం లేకుండా చేస్తోంది. అదే బ్లాక్ ఫంగస్, ఇప్పటి వరకూ ఢిల్లీ, అహ్మదాబాద్, మహారాష్ట్రల్లో బయటపడిన ఈ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ తాజాగా హైదరాబాద్‌లో(Hyderabad) వెలుగు చూసింది. నగరంలోని కాంటినెంటల్ హాస్పటల్‌లో తాజాగా ఈ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించడం కలకలం కల్గిస్తోంది. బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ సోకినవారిలో సైతం కరోనా లక్షణాలే కన్పిస్తుండటం ఆందోళనగా మారింది. కరోనా చికిత్సలో భాగంగా అడ్డగోలుగా స్టెరాయిడ్స్ వాడినవారిలో..రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ బ్లాక్ ఫంగస్(Black fungus) ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా కన్పిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఏకంగా ఇప్పుడు హైదరాబాద్‌లో వెలుగు చూడటం ఆందోళనగా మారింది. 

ఈ ఫంగస్ ముక్కు నుంచి రక్తనాళాలకు వెళ్లి కండరాలు, ఎముకల్ని దెబ్బతీస్తుంది.ఇది ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది. వాతావరణంలో సహజంగా ఉండే మ్యుకోర్ అనే ఫంగస్ కారణంగా ఇది వ్యాపిస్తుంది. అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకున్నవారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, కోవిడ్ చికిత్సలో ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడిన వారికి , ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకపోయినా ఇది వ్యాపిస్తుంది. అందుకే డయాబెటిస్ ఉన్వారు ఎప్పటికపా్పుడు స్టెరాయిడ్స్ (Steroids usage Effect) మానిటర్ చేసుకోవాలి. ముక్కు, నోటిలో పొక్కులు వస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. బ్లాక్ ఫంగస్ అనేది కేవలం కోవిడ్ రోగులకే కాదు..కోవిడ్ సోకని వ్యక్తులకు కూడా వస్తుంది. క్లీన్ చేయని ఏసీ గాలి పీల్చడం ద్వారా, డస్ట్‌లో ఎక్కువగా తిరగడం వల్ల కూాడా రావచ్చు.

Also read: Telangana Lockdown: తెలంగాణ లాక్‌డౌన్‌పై సాయంత్రానికి నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News