Bandi Sanjay on CM Kcr: కుట్రలో భాగంగానే ఆర్టీసీ ఛార్జీల మోత..సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్..!

Bandi Sanjay on CM Kcr: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశం రాజకీయ వేడిని రాజేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. 

Written by - Alla Swamy | Last Updated : Jun 10, 2022, 02:19 PM IST
  • ఆర్టీసీ ఛార్జీల పెంపుపై పొలిటికల్ వార్
  • తెలంగాణ ప్రభుత్వంపై విపక్షాల ఆగ్రహం
  • తాజాగా బండి సంజయ్ విసుర్లు
Bandi Sanjay on CM Kcr: కుట్రలో భాగంగానే ఆర్టీసీ ఛార్జీల మోత..సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్..!

Bandi Sanjay on CM Kcr:తెలంగాణవ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. తక్షణం పెంచిన ఛార్జీలను తగ్గించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే మరో ప్రజా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌ స్టేషన్‌ ముందు బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం బస్‌స్టేషన్‌లో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడారు. 

ఛార్జీల పెంపుపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. వరుసగా ఛార్జీల మోతపై ప్రయాణికులు సైతం అసహనం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఛార్జీలను 60 శాతం పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మండిపడ్డారు బండి సంజయ్.పేదలకు ఆర్టీసీ బస్సులే దిక్కు అని..అలాంటి వారిపై ఛార్జీల భారం వేయడం ఏంటని ప్రశ్నించారు. మూడేళ్లలో ఐదుసార్లు బస్సు ఛార్జీలు పెంచారని ఫైర్ అయ్యారు. ఇదంతా చూస్తుంటే ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

ఇందులోభాగంగా కావాలనే ఛార్జీలను పెంచుతున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని..రెండు పీఆర్సీలు, ఆరు డీఏలు ఇంతవరకు చెల్లించలేదన్నారు. అంతకముందు బండి సంజయ్‌ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. జేబీఎస్‌ వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటి వద్దే గృహ నిర్బంధం చేశారు. ఈక్రమంలోనే ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీస్ ఎస్కార్ట్‌తోనే జేబీఎస్‌కు బండి సంజయ్ వెళ్లారు. ప్రయాణికులతో ముచ్చటించారు. 

Also read:Chandrababu Fire: వివేకా కేసులో సాక్షులను చంపేస్తున్నారు.. చంద్రబాబు సంచలన ఆరోపణలు

Also read:Tirumala Temple: తిరుమలలో కాసుల పంట..స్వామి వారికి రికార్డు స్థాయిలో ఆదాయం..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News