BJP తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

BJP Telangana Chief Bandi Sanjay Kumar: తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 30 మంది వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని, బీజేపీ శ్రేణులతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Jan 1, 2021, 02:16 PM IST
  • వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే
  • కాంగ్రెస్ ఎమ్మెల్యులు, 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు
  • సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్
BJP తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

BJP Telangana Chief Bandi Sanjay Kumarఫ వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ(BJP) అని మరోసారి సంకేతాలిచ్చారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 30 మంది వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని, బీజేపీ శ్రేణులతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు తెలంగాణలో వరుస ఎన్నికలలో అధికార టీఆర్ఎస్‌(TRS)కు వ్యతిరేక పవనాలు వీస్తుండగా.. బీజేపీ బాన్ని పుంజుకుంటోంది. హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసిన అనంతరం ఎంపీ బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఫలితాలు విడుదలై నెలరోజులు గడిచాయని, రాజ్యాంగబద్ధంగా మేయర్ పదవికి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని గవర్నర్ తమిళిసైని కోరినట్లు చెప్పారు.

Also Read : Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పసిడి దారిలోనే వెండి!

కాగా, తెలంగాణ(Telangana) ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిసి దొంగ నాటకాలు ఆడుతున్నాయని.. దీనిపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మొదటునుంచీ తాను ఈసీ తీరును ఎండగడుతున్నానని, తాను చేసిన ఆరోపణలు నిజమైనట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నెగ్గిన కార్పొరేటర్లను గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయాలి, ఆపై కొత్త పాలకమండలి ఎన్నిక ఉంటుందన్నారు. కానీ ఎన్నికల కమిషన్ ఆ పని చేయడం లేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

Also Read : EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిందా లేదా ఇలా తెలుసుకోండి

 

తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు 30 మంది వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని.. అయితే తాము ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకుంటున్నామని Bandi Sanjay Kumar సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే రాజా సింగ్, బీజేపీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, రామచందర్ రావు, తదితరులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News