Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు కవిత! పక్కా ఆధారాలు ఉన్నాయంటున్న బీజేపీ ఎంపీ

Delhi Liquor Scam: ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కాంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణలోని అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ప్రచారం సాగుతుండగా.. తాజాగా సీఎం కేసీఆర్ కుటుంబం లింకులు బయటకు రావడం కలకలం రేపుతోంది. 

Written by - Srisailam | Last Updated : Aug 21, 2022, 09:15 PM IST
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత?
  • పక్కా ఆధారాలు ఉన్నాయంటున్న బీజేపీ ఎంపీ
  • హైదరాబాద్ లోనే డీల్స్ జరిగాయి- ఎంపీ వర్మ
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు కవిత! పక్కా ఆధారాలు ఉన్నాయంటున్న బీజేపీ ఎంపీ

Delhi Liquor Scam: ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కాంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణలోని అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ప్రచారం సాగుతుండగా.. తాజాగా సీఎం కేసీఆర్ కుటుంబం లింకులు బయటకు రావడం కలకలం రేపుతోంది.  ఢిల్లీ మద్యం పాలసీ డిసైడ్ చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి అనుచరులేనని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు 150 కోట్ల రూపాయల లంచం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్,  బెంగాల్ లో తీసుకొచ్చిన మద్యం పాలసీ వెనుక కూడా ఈ శక్తుల హస్తం ఉందని ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ చెబుతున్నారు.  

టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నుండి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి ఢిల్లీ లో ఒబెరాయ్ హోటల్ లో మంతనాలు జరిపారని బీజేపీ ఎంపీ తెలిపారు. ఒబెరాయ్ హోటల్ లోనే ఎక్సైజ్ పాలసీని రూపొందించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయంటున్నారు.మొదటి ఇన్ స్టాల్ మెంట్ కింద 150 కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన వారే ఈ రూ. 150 కోట్లు ఇచ్చారన్నారు.ఆరు నెలల పాటు ఒబెరాయ్ హోటల్ బుక్ చేసుకున్నారని చెప్పారు. మనీష్ సిసోడియాతో పాటు అతని అనుచరులు, తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఈ హోటల్ లోనే ఉండి తతంగం నడిపించారని బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హస్తం ఉందంటూ ఎంపీ ర్వేజ్ సింగ్ వర్మ చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనమయ్యాయి. 

కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒక ప్రైవేటు విమానంలో వచ్చేవారని చెప్పారు పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ. తెలంగాణ మద్యం మాఫియాకు చెందిన ఒక వ్యక్తి ఏర్పాటు చేసిన విమానంలో వచ్చేవారన్నారు. ఆయనే ఢిల్లీలోని ఒబేరాయ్ హోటల్ లో ఒక సూట్ రూం బుక్ చేశారని  తెలిపారు.ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా తో కలిసి ఆయనే  ఎక్సైజ్ పాలసీని రూపొందించారని వెల్లడించారు. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్, ఢిల్లీ ఎన్ 1 లైసెన్స్ హోల్డర్స్, తమ వ్యక్తులను ఇక్కడ ఏర్పాటు  చేసుకున్నారని చెప్పారు. దీనికి బదులుగానే ముందుగా ఎన్ 1 కమిషన్, లాభాలు తీసుకుంటాం, తర్వాతే మీరు తీసుకోవాలని డీల్ కుదుర్చుకున్నారని ఎంపీ వెల్లడించారు. తెలంగాణ సీఎం కుటుంబ సభ్యులతో మీరు మీటింగ్ జరిపారా? లేదా, వారిని కలిసారా? లేదా అనేది సమాధానం చెప్పాలని మనీష్ సిసోడియాను వర్మ డిమాండ్ చేశారు. 

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో  14 మందితో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది సీబీఐ. ఏ1గా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఏ14గా హైదరాబాద్  మద్యం వ్యాపారి రామచంద్ర పిళ్లై ఉన్నారు. మనీశ్ సిసోడియా నివాసం సహా ఏడు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ కోకాపేటలోని రామచంద్ర ఇంట్లోనూ సీబీఐ సోదాలు జరిపింది.  రామచంద్ర పిళ్లై ఇంట్లో కీలక డాక్యుమెంట్లు లభించాయని తెలుస్తోంది. అతని ద్వారానే ఢిల్లీ ప్రభుత్వంతో తెలంగాణ నేతలు డీల్ నడిపించారని తెలుస్తోంది. ఢిల్లీలో లిక్కర్ స్కాం జరిగినట్లు తెలుస్తోన్న సమయంలో ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ గా తెలంగాణకు చెందిన ఐఏఎస్ గోపికృష్ణ ఉన్నారు. లిక్కర్ టెండర్లను కేటాయించడానికి  ఓ మధ్యవర్తి ద్వారా సిసోడియాకు దాదాపు 150 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సీబీఐ  ఆధారాలు సేకరించిందని తెలుస్తోంది. 

కేజ్రీవాల్ సర్కార్ పాత మద్యం పాలసీని మార్చింది. మద్యం వ్యాపారం నుంచి ప్రభుత్వం తప్పుకుని.. జోన్ల వారీగా  షాపులకు అనుమతి ఇచ్చింది. ఒక్కో జోన్ లో ఎన్ని షాపులైనా పెట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇదే అదనుగా మద్యం వ్యాపారులు రంగంలోకి దిగారని తెలుస్తోంది. తెలంగాణ నేతలు మనీశ్ సిసోడియా ద్వారా లైసెన్సులు ఇప్పించారని ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలోఉన్న మద్యం షాపుల్లో 10 మంది తెలంగాణ వ్యాపారులకు వాటాలు ఉన్నాయని సమాచారం. హైదరాబాద్ లోనే డీల్స్ జరిగాయని.. ఇందుకోసం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పలు సార్లు హైదరాబాద్ వెళ్లారని ఢిల్లీ బీజేపీ ఎంపీ  పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ  ఆరోపిస్తున్నారు. దీంతో సిసోడియా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ తిరిగారు.. ఏ హోటల్ లో బస చేశారు అన్న వివరాలను సీబీఐ ఆరా తీసిందని తెలుస్తోంది. ఈ కేసులో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పాత్రతో పాటు ఎమ్మెల్సీ కవిత పాత్రకు సంబంధించిన తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయంటున్నారు బీజేపీ ఎంపీ  పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. 

మరోవైపు లిక్కర్ స్కాంలో ఏ1గా ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. మనీష్ సిసోడియాతో పాటు మరో 13 మంది పై కూడా సీబీఐ లుక్ అవుట్ నోటీసులను జారీ చేసింది. దేశం విడిచి పారి పోకుండా... ఈ పథ్నాలుగు మంది దేశం విడిచి పారి పోకుండా సీబీఐ ముందస్తుగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ షరతులు ఉల్లంఘిస్తే వారిని అదుపులోకి తీసుకునే వీలుంది. లిక్కర్ స్కాంలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై త్వరలోనే మరింత స్పష్టత వస్తుందని సీబీఐ అధికారులు చెబుతున్నారు. 

Also read:Pawan Fans Unhappy with Amit Shah: ఎన్టీఆర్ కు ఆహ్వానమా? అసంతృప్తితో పవన్ ఫాన్స్!

Also read:Amit Shah Munugode: కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతాం..కేంద్రమంత్రి అమిత్ షా హాట్ కామెంట్స్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News