TRS BJP Clashes: మంత్రి కేటీఆర్ ఇలాఖాలో హీటెక్కిన రాజకీయం.. హైదరాబాద్‌లో రాజాసింగ్ అరెస్ట్..

BJP MLA Raja Singh Arrest: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డిపేట బయలుదేరిన రాజాసింగ్‌ను అల్వాల్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2022, 04:08 PM IST
  • సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత
  • టీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల ఘర్షణ
  • ఎల్లారెడ్డిపేటకు బయలుదేరిన ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
TRS BJP Clashes: మంత్రి కేటీఆర్ ఇలాఖాలో హీటెక్కిన రాజకీయం.. హైదరాబాద్‌లో రాజాసింగ్ అరెస్ట్..

BJP MLA Raja Singh Arrest: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డిపేట బయలుదేరిన రాజాసింగ్‌ను అల్వాల్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం రాజాసింగ్‌ను అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాజాసింగ్‌తో పాటు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్-బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాజాసింగ్‌ను అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.

మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో బీజేపీ నేత ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు టీఆర్ఎస్-బీజేపీ మధ్య చిచ్చు రాజేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇరు పార్టీల నేతలు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌లో బాహాబాహికి దిగారు. పోలీస్ స్టేషన్ ఎదుట రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జి జరిపి వారిని చెదరగొట్టారు. ఇదే క్రమంలో బీజేపీ నేతలు సిరిసిల్ల టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆగయ్యపై దాడికి పాల్పడ్డారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

బీజేపీ నేతలు తమపై దాడికి పాల్పడ్డారని టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే... టీఆర్ఎస్ నేతలే తమపై దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ శనివారం (మార్చి 19) సిరిసిల్ల టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. బీజేపీ నేతలు ఆగయ్య ఇంటిపై దాడికి పాల్పడ్డారని గంగుల ఆరోపించారు. ఒక కార్యకర్తగా ఆగయ్యను పరామర్శించేందుకు వచ్చానని పేర్కొన్నారు. 

బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వలసలు పెరగడంతో.. ఆ అక్కసుతోనే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ కార్పోరేటర్లు టీఆర్ఎస్‌లో చేరుతుండటంతో.. ఏం చేయాలో అర్థం కాక బండి సంజయ్ దాడులకు ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. ఒక్క టీఆర్ఎస్ నేతపై దాడి జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇదే వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లు పిడికెడు.. తాము పుట్టెడు అన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

Also Read: IND vs AUS: మెగ్ లానింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సెమీస్‌కు ఆసీస్! ఇక టీమిండియాకు చావోరేవో!!

Capgemini Recruitment: క్యాప్ జెమినిలో డిగ్రీ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్... పూర్తి వివరాలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News