Warangal: ప్రాణం తీసిన ఒక్కరూపాయి కోసం గొడవ.. అసలేం జరిగిందో తెలుసా..?

Fighting for 1 rupee: ఒక్కరూపాయి కోసం జరిగిన గొడవ ఒక నిండు ప్రాణం గాలిలో కలవడానికి కారణమైంది. ఈ ఘటన వరంగల్ జిల్లా లో చోటు చేసుకుంది.  దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Jun 2, 2024, 01:25 PM IST
  • బిర్యానీ షాపులో గొడవ..
  • క్షణికావేశంలో ఒకరి ప్రాణాలు తీసిన ఆటో డ్రైవర్..
Warangal: ప్రాణం తీసిన ఒక్కరూపాయి కోసం గొడవ.. అసలేం జరిగిందో తెలుసా..?

Man lost his life for 1 rupee in warangal: ఆ నలుగురు మూవీలో రూపాయి.. రూపాయి.. ఏంచేస్తావంటూ.. అన్నతమ్ములన విడగొడతా, కన్న వాళ్లతో గొడవలు పెడతా, స్నేహితుల మధ్య చిచ్చు పెడతా అనే డైలాగ్ ఉంది. ఇది చాలా ఫెమస్ అయిన విషయం అయిన తెలిసిందే. ఇక డబ్బుల కోసం కొందరు ఎంత కైన తెగిస్తున్నారు. డబ్బుల విషయం వస్తే, అయిన వాళ్లు, పరాయి వాళ్లు అనే కనికరం లేకుండా గొడవలు పడి చంపడానికి సైతం వెనుకాడటంలేదు. ఇటీవల చాలా మంది ఆస్తులు, భూముల విషయంలో కొట్టుకొవడం,చంపుకొవడం వంటి ఘటనలను మనం వార్తలలో చూశాం. కొందరు క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతుంటారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

Read more: Cop cpr on monkey: హ్యాట్సాఫ్ సార్.. సీపీఆర్ చేసి కోతిని కాపాడిన పోలీసు.. వీడియో వైరల్..

పూర్తి వివరాలు..

వరంగల్ లో బిర్యానీ సెంటర్ వద్ద ఒక రూపాయి విషయంలో గొడవ జరిగింది.. ఇది కాస్త ఒక నిండు ప్రాణంపోవడానికి కారణమైంది. స్థానికంగా ఉన్న ఒక  షాపులో.. బిర్యానీ కోసం రూ.59 చెల్లించాల్సి ఉండగా.. ఒక రూపాయి అదనంగా రూ.60 ఫోన్ పే చేయడంతో ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. అది తిట్టుకుని,  నెట్టేసుకునే వరకు వెళ్లింది. వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీలో ఈ  ఘటన చోటు చేసుకుంది.  స్థానికంగా ఉన్న గాంధీ నగర్ లో .. బిర్యానీ షాపు ఉంది.

అక్కడకు ప్రేమ్ సాగర్(40) అనే వ్యక్తి వచ్చాడు. అతను ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. శుక్రవారం ఆటో నడిపిన ఆయన రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గాంధీనగర్‌లోని ఓ బిర్యానీ సెంటర్ వద్దకు వెళ్లాడు. అక్కడ బిర్యానీ తీసుకున్నాడు. అప్పుడు, అరవింద్ అనే మరో యువకుడు కూడా అక్కడికి వచ్చాడు. బిర్యానీ తీసుకున్న ఆటో డ్రైవర్ ప్రేమ్ సాగర్, దానికి 59 రూపాయలను ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించాడు. అతను ఫోన్ పే ద్వారా 60 రూపాయలు పంపాడు. ఈ క్రమంలో ఒక్క రూపాయి ఎక్కువ కొట్టావ్ అంటూ అరవింద్… ఆటో డ్రైవర్‌ను ఎగతాళి చేసి మాట్లాడాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. తనను అలా ఎందుకు అనాల్సి వచ్చిందని ప్రేమ్ సాగర్ వాదనకు దిగగా.. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి గొడవ జరిగింది.

ఇద్దరు కూడా క్షణికావేశంలో ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ నేపథ్యంలో.. అరవింద్ ఆటో డ్రైవర్ ప్రేమ్ సాగర్ కు బలంగా కిందకు నెట్టేయడంతో ఆయన కిందపడ్డాడు.  అక్కడ ఉన్న ఒక రాయి ఇతగాడి తలకు బలంగా తాకింది. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా ప్రేమ్‌ సాగర్ ను ఆస్పత్రికి తరలించారు. అతడిని టెస్టులు చేసిన వైద్యులు.. తలకు రాయి బలంగా తాకడంతో చిన్న మెదడు చిట్లి ప్రేమ్ సాగర్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 

Read more: Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..

స్థానికులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. అనంతరం ప్రేమ్ సాగర్ డెడ్ బాడీని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇదిలావుంటే ప్రేమ్ సాగర్ మరణానికి కారణమైన అరవింద్ నేరుగా మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్ కి వెళ్లి లొంగిపోయినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీంగా వైరల్ గా మారింది. ఒక్కరూపాయి కోసం గొడవలు ఏంటని, క్షణికావేశంలో లైఫ్ ను నాశనం చేసుకున్నావంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News