బండ్ల గణేష్ పొలిటికల్ ఎంట్రీ.. సీటు కూడా ఖాయం!

సినీ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి, నిర్మాతగా, వ్యాపారవేత్తగా మారిన బండ్ల గణేష్

Last Updated : Sep 14, 2018, 02:26 PM IST
బండ్ల గణేష్ పొలిటికల్ ఎంట్రీ.. సీటు కూడా ఖాయం!

సినీ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి, నిర్మాతగా, వ్యాపారవేత్తగా మారిన బండ్ల గణేష్ ఇకపై రాజకీయ నాయకుడి అవతారం కూడా ఎత్తబోతున్నాడు. అవును, బండ్ల గణేష్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో రాహూల్ గాంధీ సమక్షంలో బండ్ల గణేష్ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు గురువారమే బండ్ల గణేష్‌ను తీసుకుని ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్‌తోపాటు పలు ఇతర పార్టీల నేతలు సైతం ఇదే వేదికపై కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం. 

బండ్ల గణేష్ స్వస్థలం షాద్‌నగర్ కావడంతో అక్కడి శాసనసభ నియోజకవర్గ స్థానం నుంచి అతడు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. 

Trending News