Bandi Sanjay Phone Theft: బీజేపీ లీగల్ సెల్ విభాగం నేతలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. బీజేపీ చేస్తున్న న్యాయ పోరాటాలపై కేసీఆర్ ప్రభుత్వం నిర్బంధం చేయడం, కార్యకర్తలపై అక్రమంగా పెడుతున్న కేసుల అంశంపై లీగల్ సెల్ ప్రతినిధులతో చర్చించారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలపై మరిన్ని నిర్బంధాలు పెరగడంతోపాటు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ తెలిపారు. ఈ తరుణంలో బీజేపీ లీగల్ పార్టీ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని కోరారు. "మీరున్నారనే ధైర్యం... కాపాడతారనే విశ్వాసంతోనే కార్యకర్తలంతా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. మీరు మాకు అండగా ఉండండి. అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఎక్కడ చిన్న సంఘటన జరిగినా స్పందించండి. ప్రజా సమస్యలపై పోరాడుతున్న కార్యకర్తల పక్షాన నిలబడండి" అని బండి సంజయ్ వారిని కోరారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్కార్ తీరును, పోలీసుల వైఖరిని బండి సంజయ్ తీవ్రంగా తప్పుపట్టారు. " ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అవమానించేలా తిడతారు. ఆయన దిష్టిబొమ్మలను తగలబెడతారు. వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తారు. కేసీఆర్‌ను తిడితే మాత్రం నాన్ బెయిలెబుల్ కేసులు పెడతారు. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడతారు. పాత కేసులను తిరగదోడి జైలుకు పంపుతున్నారు. అట్లా చేసి కేసీఆర్ మెప్పు పొంది ప్రమోషన్లు పొందేందుకు కొందరు పోలీసులు ఎంతకైనా దిగజారుతున్నారు" అని అన్నారు.
తన ఫోన్ మాయమైందని స్పందిస్తూ బండి సంజయ్ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నాకు చాలా మంది ఫోన్లు చేశారు. ఆ విషయం తెలిసి కేసీఆర్ మూర్చపోయారు. నా ఫోన్ బయటకు వస్తే ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో అనే భయంతోనే కేసీఆర్ నా ఫోన్ ని తన దగ్గరే పెట్టుకున్నట్లున్నారు. ఇతరుల ఫోన్ల సంభాషణ వినడమే ఆయన పని" అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి : Minister Harish Rao Tweet: మీకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి ఇచ్చిన తక్కువే: మంత్రి హరీష్ రావు ఎమోషనల్
వాస్తవానికి కరీంనగర్‌లో పోలీసులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నప్పటి నుండి సిద్దిపేట వెళ్లే వరకు నా చేతిలోనే ఉన్న ఫోన్ ఆ తరువాత మాయమైంది. నా ఫోన్ మాయం అవడం అనేది పోలీసుల పనే అని బండి సంజయ్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. అసలు విషయాన్ని దాచి పెట్టి ఏమీ తెలియనట్టు తిరిగి తననే ఫోన్ అడగడం సిగ్గు చేటు అని ఎద్దేవా చేశారు. బీజేపీ కార్యకర్తలు దేనికీ భయపడరని, దేశం, ధర్మం కోసం పోరాడుతూనే ఉంటారని ఈ సందర్భంగా బండి సంజయ్ స్పష్టం చేశారు. " పేపర్ లీకేజీ విషయంలో కేసీఆర్ కొడుకు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా విషయంలో కేసీఆర్ కుటుంబానికో న్యాయం? ఇతరులకో న్యాయమా?" అని బండి సంజయ్ ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి : Bandi Sanjay Comments: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సన్మానం.. శాలువా తీసుకువస్తే చివరికి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK
Bandi Sanjay Phont Theft: నా ఫోన్ పోయింది.. అది పోలీసుల పనే: బండి సంజయ్