బాలకృష్ణ నాకు ఇష్టమైన నటుడు: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్

హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించిన బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ప్రారంభోత్సవానికి అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఆసక్తి్కరమైన వ్యాఖ్యలు చేశారు. 

Last Updated : May 24, 2018, 01:24 PM IST
బాలకృష్ణ నాకు ఇష్టమైన నటుడు: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్

హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించిన బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ప్రారంభోత్సవానికి అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ తనకు ఇష్టమైన నటుడు అని తెలిపిన కేటీఆర్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి గురించి తన తల్లి ఎన్నో మంచి విషయాలు చెప్పారని.. ఆ ఆసుపత్రి అభివృద్ధి గురించి మాట్లాడారని తెలిపారు.

క్యాన్సర్ లాంటి వ్యాధులను అవగాహనతో నిర్మూలించవచ్చని.. ఈ క్రమంలో సెలబ్రిటీలు కూడా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ తెలంగాణలో ట్రస్టులకు ప్రాపర్టీ ట్యాక్సులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సభలో సినీనటుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ కూడా పలు విషయాలు పంచుకున్నారు.

"దివంగత ఎన్టీఆర్ మీద ప్రేమతో తన కుమారుడికి కేసీఆర్, తారకరామారావు అని పేరు పెట్టడం సంతోషకరం. కేటీఆర్ చేతుల మీదుగా ఈ యూనిట్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. ప్రపంచ స్థాయిలో క్యాన్సర్ బాధితులకు ఈ ఆసుపత్రిలో సేవలు అందించడానికి మేము ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం" అని బాలకృష్ణ తెలిపారు.

Trending News