తెలంగాణ రాజకీయాలపై అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాలపై తమ్ముడు అక్బరుద్దీన్ కు భిన్నంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేసిన అసదుద్దీన్ ఓవైసీ.                     

Last Updated : Sep 20, 2018, 10:10 AM IST
తెలంగాణ రాజకీయాలపై అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: ప్రభుత్వ ఏర్పాటు విషయంలో  తమ్ముడు అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు భిన్నంగా అసదుద్దీన్ స్పందించారు. బుధవారం ఆయన ఓ ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలంగాణలో కర్నాటక తరహా ప్రభుత్వం రాబోదని ..ఈ సారి మెజార్టీ  ప్రభుత్వమే అధికారం చేపడుతుందని స్పష్టం చేశారు. కర్నాటకలో అతి తక్కువ సీట్లు సాధించి కుమార స్వామి సీఎం పదవి చేపట్టం సాధ్యపడినప్పుడు.. ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  ఒకే  అంశంపై ఓవైసీ బ్రదర్స్ ఇలా  భిన్నంగా స్పందించడం గమనార్హం

సీఎం పదవిపై ఓవైసీ రీయాక్షన్
వచ్చే ఎన్నికల్లో సీఎం పదవి చేపడతామని అక్బర్ చేసిన వ్యాఖ్యలను విలేఖరి గుర్తుచేయగా..దీనిపై అసదుద్దీన్ స్పందిస్తూ సీఎం పదవి చేపట్టాలనే ఆలోచన తమకు లేదని.. తమది పదవులు కోసం పాకులాడే పార్టీ కాదని.. గతంలో అనేక పార్టీలతో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాం..ఏనాడు కూడా తాము మంత్రి పదవులు అడగలేదని..తమకు మైనార్టీలు, ముస్లింల అభివృద్ధే  ప్రధాన ఎజెండా అని అసదుద్దీన్ తేల్చి చెప్పారు.

కేసీఆర్ పాలన భేష్ 
గత నాలుగేళ్ల ప్రభుత్వ పనితీరు ఆధారంగా జనాలు ఓటు వేస్తారని ..మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారనే నమ్మకం తమకుందని ఓవైసీ వ్యాఖ్యానించడం గమనార్హం. సాధారణంగా ఏదైన పార్టీ అధికారాన్ని వదులుకొని ముందస్తుగా ఎన్నికలకు వెళ్లబోదని.. కేసీఆర్ ది  చాలా బోల్డ్ నిర్ణయమన్నారు. కేసీఆర్ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందో ముందస్తు ఎన్నికల నిర్ణయమే అందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ ఒక విజన్ ఉన్న నేత అని..కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని చాలా సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లారని కేసీఆర్ ను   ఓవైసీ కొనియాడారు. 

టీఆర్ఎస్ అభ్యర్దులపై పోటీ
ఇదే సందర్భంగా కొన్ని విషయాల్లో తాము టీఆర్ఎస్ ను వ్యతిరేకించామని.. భవిష్యత్తులో కూడా వ్యతిరేకిస్తామని ఓవైసీ వ్యాఖ్యానించారు.జనాల వ్యతిరేక నిర్ణయాన్ని తాము తప్పకుండా వ్యతిరేస్తామని..ఈ విషయంలో రాజీపడబోమన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలతో సమానంగా టీఆర్ఎస్ అభ్యర్ధులను ఎదుర్కొంటామని.. అందులో తాము  తప్పకుండ విజయం సాధిస్తామని అసదుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. 

మహాకూటమి కాదు..అది అపవిత్ర కూటమి
మహాకూటమిపై ఓవైసీ స్పందిస్తూ ఇక్కడ మహాకూటమి అని  చెప్పుకుంటున్నారు.. వాస్తవానికి అది మహా కూటమి కాదు ..అది విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన అపవిత్ర కూటమి అని అసద్ నిర్వచించారు. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేంగా పురుడుపోసుకున్న టీడీపీ..ఈ రోజు రాజకీయ  అవసరాల కోసం కాంగ్రెస్ తో దోస్తీ చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. కాంగ్రెస్ -టీడీపీ కలిసి పోటీ చేసినంత మాత్రనా ఓరిగేది ఏమీ లేదన్నారు. ఆ రెండు పార్టీలు బలహీనపడబట్టే కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి తప్పితే జనాల కోసం కాదన్నారు. కాంగ్రెస్,టీడీపీలకు రాజకీయ అవసరాలు తప్పితే ప్రజలబాగోగులు పట్టవని ఓవైసీ విమర్శించారు

టీడీపీకి వ్యతిరేంగా ఏపీలో ప్రచారం చేస్తా..
గత నాలుగేళ్లుగా మోడీ సర్కార్ చేతులు కలిపిన చంద్రబాబు... ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడే సరికి ప్రజల్లోకి వచ్చి మొసలికన్నీరు కార్చితే  నమ్మేపరిస్థితిలో ఎవరూ లేరన్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ఓవైసీ ప్రకటించారు.

 

Trending News