Allam Padma Passes Away: తెలంగాణ ఉద్యమకారిణి, మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ అనారోగ్యంతో కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (ఫిబ్రవరి 22) తుది శ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో పోరాడుతున్న ఆమె.. 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్లం పద్మ అకాల మరణం తెలంగాణ సమాజంలో విషాదాన్ని నింపింది.
అల్లం పద్మ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అల్లం నారాయణను ఫోన్‌లో పరామర్శించి ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో అల్లం పద్మ పోషించిన పాత్రను ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేశారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, కేటీఆర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పద్మ మృతి పట్ల సంతాపం తెలిపారు.
అల్లం పద్మ పార్థివ దేహాన్ని బుధవారం (ఫిబ్రవరి 23) ఉదయం నిమ్స్ ఆసుపత్రి నుంచి ఎర్రగడ్డలోని జేక్ కాలనీలో ఉన్న నివాసానికి తరలించనున్నారు. ప్రజల సందర్శనార్థం అల్లం పద్మ పార్థివ దేహాన్ని కొద్ది గంటల పాటు అక్కడ ఉంచనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అల్లం పద్మ అంత్యక్రియలు జరగనున్నాయి.
'అమ్మల సంఘం' అధ్యక్షురాలిగా..:
మలి దశ తెలంగాణ ఉద్యమంలో అల్లం పద్మ పోషించిన పాత్ర మరవలేనిది. ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చిన 'అమ్మల సంఘం' అధ్యక్షురాలిగా అల్లం పద్మ సేవలందించారు. అప్పట్లో ఉద్యమాన్ని అణచివేసేందుకు యూనివర్సిటీ మెస్‌లను మూసివేయగా.. అమ్మల సంఘం విద్యార్థులకు అన్నం పెట్టి తెలంగాణ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించింది.
Also Read: Ramya Raghupati: వెలుగులోకి నటుడు నరేష్ మాజీ భార్య మోసాలు.. పలువురి నుంచి భారీగా వసూళ్లు...
Also Read: RJ Rachana: పాపులర్ రేడియో జాకీ రచన హఠాన్మరణం.. పునీత్ లాగే చిన్న వయసులో గుండెపోటుతో మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook