Kavitha Bail: ఫలించని కేటీఆర్‌, హరీశ్ రావు ప్రయత్నాలు.. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్‌

Shock To K Kavitha On Default Bail Petition: తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ షాక్‌ తగిలింది. బెయిల్‌ విషయంలో మళ్లీ నిరాశే ఎదురైంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 12, 2024, 04:44 PM IST
Kavitha Bail: ఫలించని కేటీఆర్‌, హరీశ్ రావు ప్రయత్నాలు.. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్‌

K Kavitha Default Bail: ఢిల్లీ మద్యం కేసులో జైలులో ఉన్న తెలంగాణ నాయకురాలు కల్వకుంట్ల కవితకు కలిసి రావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆమెకు బెయిల్‌ అనేది లభించడం లేదు. తాజాగా బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఆమె సోదరుడు కేటీఆర్‌, హరీశ్ రావు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. రెండు, మూడు రోజులుగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. బెయిల్‌ ఇవ్వరాదని  నిర్ణయించిన కోర్టు తీర్పు ఇవ్వకుండా విచారణను మాత్రం వాయిదా వేసింది.

Also Read: Attack On Zee Telugu: జీ మీడియా దాడిపై భగ్గుమన్న తెలంగాణ.. డీజీపీ, ప్రెస్‌ అకాడమీ, ఎంపీకి ఫిర్యాదులు

 

ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్‌ విషయమై శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో సీబీఐ కేసుపై న్యాయస్థానంలో విచారణ జరగ్గా సీబీఐ మాత్రం ఆమెకు బెయిల్‌ ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రపై సీబీఐ  దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుంది. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్‌ కోసం కవిత పిటిషన్‌ వేయగా విచారణ చేపట్టింది. సీబీఐ చార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని న్యాయవాది నితీష్ రాణా ఆరోపించారు.

Also Read: Zee Telugu News Attack: జీ తెలుగు దాడిపై గవర్నర్‌, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు

అయితే చార్జ్‌షీట్‌లో ఎలాంటి తప్పులు లేవన్న సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. చార్జ్‌షీట్‌లో తప్పులు ఉన్నాయన్న కోర్ట్ ఆర్డర్ ఫైల్ చేశారా అని జడ్జి కావేరి భవేజా ప్రశ్నించారు. చార్జ్‌షీట్‌లో తప్పులున్నాయన్న కోర్ట్ ఆర్డర్ ఫైల్‌ చేయాలని జడ్జి కోరారు. కోర్ట్ ఆర్డర్ అప్‌లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా వివరించారు. ఈ సందర్భంగా తదుపరి విచారణ జూలై 22వ తేదీకి వాయిదా వేసింది.

కేటీాఆర్, హరీశ్ తీవ్ర ప్రయత్నాలు
డిఫాల్ట్ బెయిల్, చార్జ్‌షీట్‌లో తప్పులపై విచారణ జరిగేంత వరకు చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా కోరారు. చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశం కవిత డిఫాల్ట్ బెయిల్‌కి సంబంధం లేదని సీబీఐ తరఫు న్యాయవాది వివరించారు. చార్జ్‌షీట్ పూర్తిగా లేదని వాదించడం లేదు.. తప్పుగా ఉందని చెబుతున్నట్లు నితీష్ రాణా తెలిపారు. ఆఖరకు డిఫాల్ట్‌ బెయిల్‌ విషయంలోనూ కవితకు నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News