Oxygen Supply: కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారింది. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో కావల్సిన బెడ్స్, ఆక్సిజన్ లేక ప్రభుత్వాలు నిస్సహాయమవుతున్నాయి. ఈ తరుణంలో ఆక్సిజన్ సరఫరా బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనంటున్నారు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్(Coronavirus cases) కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల కన్పిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ(Telangana)లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ( Minister Etela Rajender) అంగీకరించారు. మహారాష్ట్ర ప్రభావం తెలంగాణపై ఉందని..అందువల్లనే కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. తెలంగాణలో వ్యాక్సిన్ సమస్య ఉందని..కావల్సిననన్ని వ్యాక్సిన్ డోసులు కేంద్ర ప్రభుత్వం (Central government) త్వరలో పంపుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా (Oxygen Supply) తగ్గించి..ఆరోగ్య రంగానికి కేటాయించాలని అధికారులను ఆదేశించారు.
ఆక్సిజన్ ఉత్పత్తి అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశమని..ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోలేవన్నారు. ఆక్సిజన్( Oxygen Supply) విషయంలో ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ పాటించాలని సూచించారు. కరోనా చికిత్సను ప్రోటోకాల్ మేరకే ఇవ్వాలి ప్రభుత్వ ఆసుపత్రులకు సూచించారు. తెలంగాణ ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. కేవలం 5-6 ఆసుపత్రుల్లోనే బెడ్స్ నిండిపోయాయని..రాష్ట్రంలో ఇంకా 60 వేల బెడ్స్ ఖాళీగా ఉన్నాయన్నారు. స్వీయ నియంత్రణ తప్ప మరో మార్గం లేదన్నారు. బంద్, లాక్ డౌన్( Lockdown), కర్ఫ్యూ( Curfew) లు విధించే అవకాశం లేదన్నారు. ప్రజలంతా మాస్క్ ధరించాలని..భౌతిక దూరం పాటించాలని మంత్రి ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.
Also read: Telangana Corona Cases: తెలంగాణలో 5 వేలు దాటిన కరోనా కేసులు, ఏకంగా 15 మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook