Telangana: అక్రమాస్తుల కేసులో మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తు: అనిశా కోర్టు కీలక తీర్పు

TS News: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనిశా ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. అనిశాకు చిక్కిన ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పటికీ, అతడి నేరం రుజువు అయితే కుటుంబసభ్యుల అధీనంలోని ఆస్తుల్ని జప్తు చేయాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 10:08 AM IST
  • మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తు
  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కోర్టు కీలక తీర్పు
  • భార్య, బిడ్డల పేరిట ఉన్న ఆస్తుల స్వాధీనానికి ఆదేశం
Telangana: అక్రమాస్తుల కేసులో మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తు: అనిశా కోర్టు కీలక తీర్పు

TS News: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు(illegal assets case)లో అనిశా ప్రత్యేక న్యాయస్థానం(ACB special Court) సంచలన తీర్పు ఇచ్చింది. అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు చిక్కిన ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పటికీ, అతడి నేరం రుజువుకావడంతో కుటుంబసభ్యుల అధీనంలోని ఆస్తుల్ని జప్తు(Seize) చేయాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. 

వివరాల్లోకి వెళితే...
అబిడ్స్‌లోని పబ్లిక్‌ అకౌంట్స్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన కె.వెంకటేశ్వరరావుపై అనిశా 2002లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదుచేసింది. దర్యాప్తులో రూ.2.89 కోట్ల వరకు ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు నిర్ధారణయింది. ఆ ఆస్తులను నిందితుడు తన భార్య శ్యామల, కొడుకులు మాధవ్‌, శేషగిరి పేరిట కూడబెట్టినట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు వారినీ నిందితులుగా చేర్చారు. 

Also read: Cryptocurrency: క్రిప్టో కరెన్సీలో నష్టం...పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య..

కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడు మరణించాడు. ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ జరిగింది. వాదనలు ముగియడంతో...ప్రిన్సిపల్‌ జడ్జి సాంబశివరావునాయుడు సోమవారం తీర్పు వెలువరించారు. కుటుంబ సభ్యులను నిర్దోషులుగా తేల్చారు. వెంకటేశ్వరరావు అక్రమార్జన ద్వారా కూడబెట్టిన సొమ్ముతో కొనుగోలుచేసిన ఆస్తులు కుటుంబసభ్యుల పేరిట ఉన్నట్లు తేలడంతో ఆయా ఆస్తుల్ని జప్తు చేయాలని ఆదేశించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News