7th pay commission: తెలంగాణలో వేతన సవరణ ప్రకటన, ఉద్యోగులపై కేసీఆర్ వరాలు

7th pay commission: ఉద్యోగులంతా ఆశగా ఎదురుచూస్తున్న వేతన సవరణ ప్రకటన రానే వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులపై వరాలు కురిపించారు. ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు 61కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 22, 2021, 04:34 PM IST
  • ఉద్యోగులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు
  • వేతన సవరణపై ప్రకటన, 30 శాతం పీఆర్సీ ప్రకటన
  • ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంపు
7th pay commission: తెలంగాణలో వేతన సవరణ ప్రకటన, ఉద్యోగులపై కేసీఆర్ వరాలు

7th pay commission: ఉద్యోగులంతా ఆశగా ఎదురుచూస్తున్న వేతన సవరణ ప్రకటన రానే వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులపై వరాలు కురిపించారు. ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు 61కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

వేతన సవరణ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) గుడ్ న్యూస్ అందించారు. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ప్రకటించారు. అటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా 61 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి అంటే తక్షణం ఈ నిర్ణయం అమల్లో వస్తుందని చెప్పారు. 

కేసీఆర్ ఏమన్నారు..

కరోనాతో వేతన సవరణ (Pay Revision Commission)లో ఆలస్యం జరిగింది. ఉద్యోగ సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిగాయి. త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించింది. తెలంగాణ(Telangana) ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనది. ఉద్యోగ సంఘాలతో స్వయంగా నేను కూడా చర్చించాను. 2014లో 43 శాతం ఫిట్‌మెంట్ (Fitment) ప్రకటించాం. ఈ సారి 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు పెంచుతాం. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తాం..స్వయంగా కేసీఆర్ చెప్పిన మాటలివి. 

అదేవిధంగా హోంగార్డులు, వీఏవో, వీఆర్ఏ, ఆశావర్కర్లు, అంగన్ వాడీ, విద్యావాలంటీర్లు, సెర్ఫ్ సిబ్బందికి పీఆర్సీ (PRC) వర్తింపజేస్తామన్నారు. అటు పెన్షనర్ల వయోపరిమితిని 75 నుంచి 70 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పారు. అర్హులైన ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు కల్పించనున్నారు. దంపతులైన ఉద్యోగులకు అంతర్ జిల్లా బదిలీలకు ఆమోదం తెలిపారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు అందిస్తున్నారు. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగుల్ని రిలీవ్ చేస్తామన్నారు. 

Also read: Telangana COVID-19 Cases: తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, డిశ్ఛార్జ్ కన్నా రెట్టింపు పాజిటివ్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News