Viral: అనుమానం అనేది పెద్ద రోగం... శరీరంలో ఏమీ లేకున్నా కూడా ఏదో ఉంది అనే అనుమానం ఉంటే నిలబడే ఓపిక కూడా ఉండదు. మానసికంగా కృంగి పోవడంతో పాటు లేని పోని కొత్త రోగాలు వస్తాయి. ఈ సంఘటన ఒక గ్రామంలోని మొత్తం మూడు వందల మంది విషయంలో నిరూపితం అయ్యింది. వారికి ఎలాంటి అనారోగ్య సమస్య లేదు... కానీ వారంతా కూడా ఆసుపత్రికి పరుగులు తీశారు.. అక్కర్లేని వ్యాక్సిన్ వేయించుకున్నారు.
అవసరం లేని విశ్రాంతి తీసుకుంటూ రకరకాలుగా ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటన ఆసీఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఒక బర్రెను కుక్క కరవడం.. ఆ బర్రె యొక్క దూడ ఇటీవల చనిపోవడం.. ఆ బర్రె పాలు తాగిన గ్రామస్తులు అంతా కూడా ఆసుపత్రి చుట్టు పరుగులు పెట్టడం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో కాసబోయిన నాగయ్య అనే పాడి రైతు ఉన్నాడు. ఆయనకు 15 పాడి గేదెలు ఉన్నాయి. ఆ పాడి గేదల యొక్క పాలు గ్రామంలోని చాలా మందికి అమ్ముతూ ఉంటాడు. రెండు నెలల క్రితం ఒక గేదెని పిచ్చి కుక్క కరిచింది. సాధారణంగా అయితే కుక్క కరిచిన వెంటనే గేదెకి ఇంజక్షన్ వేయించాల్సి ఉంటుంది.
Also Read: Pragya Jaiswal Pics : పాంట్ జిప్ తీసేసి ప్రగ్యా అందాల ఆరబోత.. బాలయ్య భామా మజాకా?
కానీ అతడు ఇంజక్షన్ వేయించలేదు సరి కదా కనీసం ఆ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ గేదె సాధారణంగానే ఉండటంతో పాలు పిండి గ్రామస్తులకు రోజూ లాగే పోస్తూ వచ్చాడు. ఎవరికి ఏం కాలేదు.. కానీ ఇటీవల ఆ గేదె యొక్క దూడ చనిపోయింది. కుక్క కరిచిన గేదె పాలు తాగడం వల్లే దూడ చనిపోయి ఉంటుందని నాగయ్య కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు అనుకున్నారు. ఆ విషయం కాస్త ఊర్లో తెలిసి ఆందోళన మొదలు అయ్యింది.
నాగయ్య నుండి పాలు కొనుగోలు చేసిన వారంతా కూడా ఉరుకులు పరుగులు పెట్టారు. మొత్తం 302 మంది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అంతే కాకుండా వారంతా కూడా ఆసుపత్రికి వెళ్లి ప్రత్యేక చికిత్సలు పొందుతున్నారు. కొందరు ఆ టెస్ట్ ఈ టెస్ట్ అంటూ చేయించుకుంటున్నారు. డబ్బులు ఉన్న వారు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే.. లేని వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు.
పాలు వేడి చేసిన తర్వాత తాగుతాం కనుక ఎలాంటి ఆందోళన అక్కర్లేదని.. అలాగే ఆ గేదె యొక్క దూడ ఇతర అనారోగ్య కారణాల వల్ల చనిపోయి ఉంటుందని.. గ్రామస్తులు ఎలాంటి ఆందోళన పడకుండా ఉండాలంటూ వైధ్యులు చెప్పారట. అయినా కూడా గ్రామస్తులు మాత్రం ఆందోళనతో ఉన్నారు. ఏ క్షణంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో అని వారంతా కూడా బిక్కుబిక్కుమంటున్నారట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Viral: గేదెని కరచిన కుక్క... ఊరంతా ఆగం ఆగం