వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్న జనం; నిన్న ఒక్క రోజే 16 మందిని బలి తీసుకున్న భానుడు

తెలంగాణ రాష్ట్రంలో భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు

Last Updated : May 27, 2019, 12:43 PM IST
వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్న జనం; నిన్న ఒక్క రోజే 16 మందిని బలి తీసుకున్న భానుడు

తెలంగాణలో రోజు రోజుకు ఉష్ట్రోగ్రతలు పెరిగిపోతున్నాయి. సామాన్య జనంపై భానుడు తన తడాఖా చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటల నుంచే భగ భగ మంటున్న ఎండలతో  జనాలను బాంబేలెత్తిపోతున్నారు. నిన్న గరిష్ఠంగా 47.8 ఉష్ణోగ్రత నమోదు అవడాన్ని బట్టి చూస్తే ఎండల తీవ్ర ఏపాటిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. భగ భగ మండే ఎండలకు తోడు వడగాల్సులు తోడవడంతో పరిస్థితి మరింత దిగజారిపోతోంది.

పిట్టల్లా రాలిపోతున్న జనాలు

వడగాల్పులతో జనాలు పిట్లల్లా రాలిపోతున్నారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం నిన్న ఒక్క రోజులోనే తెలంగాణలో 16 మంది మరణించారు. దీన్ని బట్టి పరిస్థితి ఎంత ఆందోళక కరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా మరో వారం పాటు వాడగాల్పులు   తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. 

బయటికి వెళ్తే ఖబర్దార్ !!

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు అత్యవసరం తప్పితే బయటికి రాకపోవడం మంచిందని  అధికారులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. లేతరంగు వస్త్రాలు ధరించే బయటకు వెళ్లాలనీ పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Trending News