Realme GT 3 is a World Fastest Charging Smartphone: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌ను చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ 'రియల్‌మీ' విడుదల చేసింది. అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే ఫోన్ 'రియల్‌మీ జీటీ 3' (Realme GT 3). ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. కేవలం 10 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. జీటీ సిరీస్‌లో రియల్‌మీ జీటీ 3ని 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' 2023లో కంపెనీ లాంచ్ చేసింది. 240W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వస్తోంది. రియల్‌మీ జీటీ 3 ఫోన్ ధర, ఫీచర్లను ఇప్పుడు చూద్దాం.
Realme GT 3 Battery:
తాజా సమాచారం ప్రకారం... రియల్‌మీ జీటీ 3 స్మార్ట్‌ఫోన్‌లో 50 శాతం (సున్నా నుంచి 50 శాతం వరకు) ఛార్జింగ్ కేవలం 4 నిమిషాల్లోనే అవుతుంది. ఇక బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 9 నిమిషాల 30 సెకన్లు పడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే 'ఆర్‌జీబీ' ఎల్‌ఈడీ ప్యానెల్. ఫోన్ వెనుక వైపు ఆర్‌జీబీ ఎల్‌ఈడీ ప్యానెల్.. 25 రంగులను వెలువరిస్తుంది. కాల్స్, మెసేజ్, నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎల్‌ఈడీ అలర్ట్ వస్తుంది. యూజర్‌లు తనకు నచ్చినట్లుగా ఈ రంగులను మార్చుకోవచ్చు.
Realme GT 3 Price:
రియల్‌మీ జీటీ 3 స్మార్ట్‌ఫోన్ ఐదు వేరియంట్లలో వస్తోంది. 8 జీబీ + 128 జీబీ, 12 జీబీ + 256 జీబీ, 16 జీబీ + 256 జీబీ, 16జీబీ + 512 జీబీ, 16 జీబీ+1 టీబీ వేరియంట్లో వస్తోంది. ఈ ఫోన్ ధర ఎంత అనేది ఇంకా వెల్లడి కాలేదు. అయితే బేస్ వేరియంట్ ధర భారత మార్కెట్లో రూ. 53500 నుంచి ప్రారంభం కావొచ్చని సమాచారం తెలుస్తోంది. ఈ ఫోన్ అమ్మకాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనేది కూడా కంపెనీ వెల్లడించలేదు.
Realme GT 3 Features:
రియల్‌మీ జీటీ 3 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13, యూఐ 4.0తో వస్తోంది. 6.74 అంగుళాల 1.5కె అమోలెడ్, 144Hz రీఫ్రెషర్ రేటు కలిగిన డిస్‌ప్లే ఉంటుంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8+ జనరేషన్ ప్రాసెసర్ ఇందులో అమర్చారు. వెనుక వైపు 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సర్, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మైక్రో సెన్సర్ ఉంటుంది. ఇక ముందువైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఉంటుంది.
Also Read: IND vs AUS: షేన్ వార్న్ రికార్డు బద్దలు కొట్టిన నాథన్ లియోన్.. ప్రపంచ క్రికెట్‌లో తొలి బౌలర్‌గా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.