Whatsapp Latest Update: వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే అప్‌డేట్.. ఈమెయిల్ ద్వారా వెరిఫై చేసుకోండి ఇలా..!

Whatsapp Email Verification Feature: వాట్సాప్‌ లాగిన్‌కు ఇక నుంచి ఈమెయిల్ వెరిఫికేషన్ ఉపయోగించవచ్చు. మొబైల్ నంబరుకు ఓటీపీ రాలేని సమయంలో మీరు ఈమెయిల్‌ను ఉపయోగించి వెరిఫై చేసుకోవచ్చు. ప్రస్తుతం అప్‌డేట్ ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2023, 07:13 PM IST
Whatsapp Latest Update: వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే అప్‌డేట్.. ఈమెయిల్ ద్వారా వెరిఫై చేసుకోండి ఇలా..!

Whatsapp Email Verification Feature: వాట్సాప్ సరికొత్త అప్‌డేట్స్‌తో వినియోగదారులకు అబ్బురపరుస్తోంది. రీసెంట్‌గా వాట్సాప్ అకౌంట్స్‌కు ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ ఫీచర్ iOS వినియోగదారులకు అందుబాటులో ఉంది. గతంలో వాట్సాప్ కేవలం ఫోన్ నంబర్ ద్వారానే వెరిఫికేషన్‌కు పర్మిషన్ ఇచ్చింది. కానీ కొత్త ఫీచర్‌తో మీరు మీ ఫోన్ నంబర్ లేకుండా మీ వాట్సాప్ అకౌంట్‌ను వెరిఫై చేసుకోవచ్చు. ఈమెయిల్ చిరునామాను వైరిఫై చేసుకున్నా.. మీ వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. ఈమెయిల్ వెరిఫికేషన్ అదనపు సెక్యూరిటీ ఫీచర్‌ కలిగి ఉంటుంది. మీ ఫోన్ నంబరు కోల్పోయినా.. ఈమెయిల్ చిరునామాను ఉపయోగించి మీ వాట్సాప్ అకౌంట్‌ను ఉపయోగించవచ్చు.

వాట్సాప్ ఇటీవల iOS 23.24.70 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ లేటెస్ట్ అప్‌డేట్ ఇది వినియోగదారులు వారి అకౌంట్‌ల కోసం ఈమెయిల్ వెరిఫికేషన్‌ను ప్రారంభించేందుకు పర్మిషన్ ఇస్తుంది. ఈ ఫీచర్ చేంజ్‌లాగ్‌లో కనిపించదు. అయితే ఇది అందుబాటులో ఉందని WABetaInfo వెల్లడించింది. ఈమెయిల్ వెరిఫికేషన్‌ను ప్రారంభించేందుకు వినియోగదారులు వారి వాట్సాప్ సెట్టింగ్‌లకు వెళ్లి 'అకౌంట్'ని ట్యాప్ చేయాల్సి ఉంటుంది.

ఇక్కడ 'ఈమెయిల్ అడ్రస్'పై క్లిక్ చేసి.. వారి ఈమెయిల్ చిరునామాను ఎంటర్ చేయాలి. ఈమెయిల్ చిరునామాను ఎంటర్ చేసి తరువాత.. కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. వినియోగదారులు తమ ఈమెయిల్ అడ్రస్‌ను వెరిఫై చేసేందుకు ఓ లింక్ వస్తుంది. ఆ లింక్‌పై క్లిక్ చేసి వెరిఫై చేస్తే సరిపోతుంది. మొబైల్ నంబరు ద్వారా ఆరు అంకెల కోడ్‌తో మీ వాట్సాప్‌ను వెరిఫై చేయలేకపోతే.. ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. అయితే వాట్సాప్ ఫోన్ నంబర్‌లను ఈమెయిల్ అడ్రస్‌తో భర్తీ చేసే ఆప్షన్‌ లేదు. ఈ ఫీచర్ కేవలం అదనపు యాక్సెస్ పద్ధతికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో Androidకి కూడా వస్తుందని భావిస్తున్నారు.

"ఈ ఫీచర్ వినియోగదారుల ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. ఫోన్ నంబరుకు ఆరు అంకెల ధృవీకరణ కోడ్ స్వీకరించలేని పరిస్థితుల్లో ఈమెయిల్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా వస్తుంది. ఈ ఫీచర్ వ్యక్తిగత వినియోగదారులకు, సంస్థలకు ప్రయోజనకరంగా ఉంటుంది.." అని WABetaInfo తెలిపింది.

Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News