WhatsApp Latest Updates: వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్.. స్టాటస్‌లో సరికొత్త మార్పు

WhatsApp Status: వాట్సాప్ త్వరలోనే సరికొత్త అప్‌డేట్‌ను పరిచయం చేయనుంది. ఇక నుంచి స్టాటస్‌లో ఒక నిమిషం వీడియోను షేర్ చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం టెస్టింగ్ వర్షన్‌లో ఉండగా.. త్వరలోనే గ్లోబల్ యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2024, 03:00 PM IST
WhatsApp Latest Updates: వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్.. స్టాటస్‌లో సరికొత్త మార్పు

WhatsApp Status: లేటెస్ట్ అప్‌డేట్స్‌తో వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది వాట్సాప్. త్వరలోనే మరో అదిరిపోయే అప్‌డేట్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం స్టేటస్‌లో 30 సెకెన్ల వీడియోను షేర్ చేసే అవకాశం ఉండగా.. త్వరలోనే ఒక నిమిషం వీడియోలను షేర్ చేసే విధంగా అప్‌డేట్ తీసుకురానుంది. ఈ విషయాన్ని WABetaInfo ట్వీట్ చేసింది. ప్రస్తుతం వినియోగదారులకు వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లను అందిస్తోంది. గత కొన్ని రోజులుగా వాట్సాప్ చాలా మార్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే స్టాటస్‌లో నిమిషం వీడియో షేర్ చేసే విధంగా మార్పులు చేయనుంది.

Also Read: Divi Vadthya: సముద్రపు అలలపై సొగసు సెగలు రేపుతోన్న దివి.. బిగ్‌బాస్ బ్యూటీ అందాల రచ్చకు సోషల్ మీడియా షేక్..
 
లేటెస్ట్ అప్‌టేడ్ అందుబాటులోకి వచ్చిన తరువాత యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ తరహాలో వినియోగదారులు స్టేటస్ అప్‌డేట్‌లో ఒక నిమిషం వీడియోను షేర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు స్టేటస్ అప్‌డేట్‌లలో కేవలం 30 సెకన్ల వీడియోలను మాత్రమే షేర్ చేసుకునే అవకాశం ఉంది. WhatsAppలో ఈ కొత్త ఫీచర్ గురించి సమాచారాన్ని ట్వీట్ చేస్తూ.. కొత్త ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. త్వరలో బీటా వినియోగదారుల కోసం వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. 

 

బీటా వినియోగదారులు తాజా అప్‌డేట్‌ను ఆండ్రాయిడ్ 2.24.7.6 కోసం WhatsApp బీటాలో తనిఖీ చేయవచ్చు. కొంతమంది బీటా వినియోగదారుల కోసం మాత్రమే కంపెనీ ఈ ఫీచర్‌ను విడుదల చేసింది. వినియోగదారుల నుంచి విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. వాట్సాప్ స్టేటస్‌లో లాంగ్ వీడియోలను షేర్ చేసే ఆప్షన్‌ కోసం వినియోగదారులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బీటా టెస్టింగ్ పూర్తయిన తర్వాత.. కొత్త అప్‌డేట్‌ను గ్లోబల్ యూజర్‌లకు కూడా అందుబాటులోకి తీసుకున్నారు.

అంతేకాకుడా యూపీఐ పేమెంట్స్ చెల్లింపు కోసం QR కోడ్‌ని స్కాన్ చేసే సరికొత్త ఫీచర్ కూడా వాట్సాప్‌లో రానుంది. ఈ ఫీచర్‌ని బీటా టెస్ట్ చేస్తోంది. కొత్త ఫీచర్ ద్వారా చాట్ లిస్ట్‌లోనే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసేందుకు ఆప్షన్ ఇవ్వనుంది. చాట్ లిస్ట్ స్క్రీన్ పైభాగంలో కెమెరా ఐకాన్ పక్కన కొత్త ఐకాన్ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ట్వీట్ చేసింది. ఆండ్రాయిడ్ 2.24.7.3 కోసం వాట్సాప్ బీటాలో కంపెనీ ఈ ఫీచర్‌ను విడుదల చేస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్ బీటా టెస్టింగ్‌ను కంప్లీట్ అవ్వగానే.. వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.

Also Read: Summer Heat Stroke: దంచికొడుతున్న ఎండలు.. ఈ సింప్టమ్స్ కన్పిస్తే వడదెబ్బ తగిలినట్లే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News