Vivo Y16 Price: అతి చౌకగా అమెజాన్‌లో Vivo Y16 మొబైల్‌ను కేవలం రూ.599కే పొందండి..డిస్కౌంట్‌ వివరాలు!

Vivo Y16 Price: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్‌ ప్రత్యేక డీల్స్‌ను అందిస్తోంది. ఈ డీల్స్‌లో భాగంగా వీవో కంపెనీకి సంబంధించి మొబైల్స్‌ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2023, 06:38 PM IST
Vivo Y16 Price: అతి చౌకగా అమెజాన్‌లో Vivo Y16 మొబైల్‌ను కేవలం రూ.599కే పొందండి..డిస్కౌంట్‌ వివరాలు!

Vivo Y16 Price: ప్రస్తుతం చాలా బ్రండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ ఫోన్స్‌ అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. అతి తక్కువ ధరలోనే ఎక్కువ ర్యామ్‌, హై ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లోని ప్రత్యేక డీల్స్‌లో భాగంగా అతి తక్కువ ధరలకే స్మార్ట్‌ ఫోన్స్‌ లభిస్తున్నాయి. ఈ ప్రత్యేక డీల్స్‌లో భాగంగా స్మార్ట్‌ ఫోన్‌లను కొనుగోలు చేస్తే దాదాపు 25 నుంచి 40 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే ఏయే స్మార్ట్‌ ఫోన్స్‌పై ఎలాంటి ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అమెజాన్‌లోని వీవో స్మార్ట్ ఫోన్‌లను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది. వీవో ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన Vivo Y16 మొబైల్‌ అత్యంత చౌకగా లభిస్తోంది. ప్రస్తుతం 4 GB RAM + 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన స్మార్ట్‌ ఫోన్‌ 34 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర  MRP రూ. 15,999 కాగా ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌లో భాగంగా కేవలం రూ.10,499కే లభిస్తోంది. 

ఈ మొబైల్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా అదనపు తగ్గింపుతో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 750 వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ కేవలం రూ.9,749కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ Vivo Y16 స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.9,900 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక ఎక్చేంజ్‌ ఆఫర్‌ పోను ఈ మొబైల్‌ రూ.599కే లభిస్తోంది. అయితే ఈ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ అనేది మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌తో పాటు పాత స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌ను బట్టి అధారపడి ఉంటుంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

ఫీచర్స్, స్పెసిఫికేషన్‌లు:
ఈ Vivo Y16 స్మార్ట్ ఫోన్‌ 6.51 అంగుళాల HD + IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ డిస్ప్లే వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌తో రాబోతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్‌ 4 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ MediaTek Helio P35 చిప్‌సెట్‌పై పని చేస్తుంది. అంతేకాకుండా ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇతర ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఇతర ఫీచర్స్:
13-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌య కెమెరా
2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ కెమెరా
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
Android 12 ఆధారంగా Funtouch OS 12
5000mAh బ్యాటరీ 
10 వాట్ల ఛార్జింగ్‌ సపోర్ట్‌
Vivo Y16ని స్టెల్లార్ బ్లాక్, డిజ్లింగ్ గోల్డ్ కలర్ ఆప్షన్స్‌

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News