Samsung Galaxy S23 FE: రూ.67 చెల్లిస్తే శాంసంగ్ గెలాక్సీ S23 FE ఫోన్ మీ సొంతం.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..!

Samsung Galaxy S23 FE Review: అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S23 FE మొబైల్ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. రోజుకు రూ.67 చెల్లింపుతో మీరు ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఫీచర్లు ఏంటి..? కెమెరా ఎలా పని చేస్తుంది..? బ్యాటరీ కెపాసిటీ ఎంత..? పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2023, 07:21 PM IST
Samsung Galaxy S23 FE: రూ.67 చెల్లిస్తే శాంసంగ్ గెలాక్సీ S23 FE ఫోన్ మీ సొంతం.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..!

Samsung Galaxy S23 FE Review: Samsung Galaxy S23 సిరీస్, Samsung Galaxy S23, Galaxy S23+, Galaxy S23 Ultra ఫోన్లకు వినియోగదారుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. సరికొత్త డిజైన్, వేగవంతమైన చిప్‌సెట్, పవర్‌ఫుల్ కెమెరాతో Samsung Galaxy S23 సిరీస్ కస్టమర్లను ఆకట్టుకుంది. Samsung Galaxy S23 సిరీస్‌లో భాగంగా Samsung Galaxy S23 FE ని మన దేశంలో ప్రారంభించింది. ఇది Samsung ‘S-సిరీస్ ’ అనుభవానికి గేట్‌‌వేగా మారనుంది. Galaxy S23 FE ఇప్పటివరకు కంపెనీ ప్రారంభించిన అత్యంత పవర్‌ఫుల్ FE ఎడిషన్. అద్భుతమైన కెమెరా, ఫుల్ గేమింగ్ సపోర్ట్, శక్తివంతమైన ప్రాసెసర్, అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ ఉంటుంది.

అత్యాధునిక కెమెరా, అత్యంత ఆకర్షణీయమైన డిజైన్, ఎక్కువ కాలం లైఫ్ ఇచ్చే బ్యాటరీ, చక్కని యూఐ ఈ ఫీచర్లు అన్ని Samsung Galaxy S23 FE ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ విషయానికి వస్తే.. Samsung Galaxy S23 FE 4nm Exynos 2200 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. ఎంతసేపు గేమ్ ఆడినా మొబైల్ హీట్ ఎక్కదు. 22 గంటల వరకు వీడియో ప్లే బ్యాక్ అందించే 4500mAh బ్యాటరీ ఉంటుంది. అంతేకాకుండా నోటిఫికేషన్ పాప్‌లేకుండా గేమ్‌ను ఆస్వాదించవచ్చు. S23 FEలోని రే ప్రేసింగ్ ఫీచర్ స్క్రీన్‌ లైటింగ్ ఎఫెక్ట్‌ను తగ్గిస్తుంది. తద్వారా వినియోగదారులు ఎంతసేపు గేమింగ్ ఆడినా కళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

కెమెరా విషయానికి వస్తే.. Samsung Galaxy S23 FE బ్యాక్‌సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఉంటుంది.‌  ఇది ఫ్లాష్ గ్రేడ్ 50MP ప్రైమరీ కెమెరా డీటెయిల్ ఎన్‌హాన్సర్, 3X ఆప్టికల్‌ జూమ్‌తో ఉంటుంది. కెమెరా ఎటువంటి పిక్సెలేషన్ సౌండ్ లేకుండా అతి సూక్షమైన వాటిని కూడా క్లియర్‌గా క్యాప్చర్ చేస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెల్ఫీలకు సూపర్ సపోర్ట్ చేస్తుంది. పోర్ట్రెయిట్‌లను లైఫ్‌లైక్ కలర్స్‌లో తీసుకోవడానికి సహాయపడుతుంది. వీడియో విషయానిక్త వస్తే.. 8K క్వాలిటీతో వీడియోను క్యాప్చర్ చేయవచ్చు. చీకటిలో కూడా చక్కగా క్యాప్చర్ చేసేందుకు Nightography సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. 

Galaxy S23 FE డిస్ ప్లే గురించి చెప్పుకుంటే.. 6.4-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది అద్భుతమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. 120Hz అడాప్టివ్ రిప్రెష్ రేట్, వైబ్రంట్  కలర్స్ కాంట్రాక్ట్స్, 1450 నిట్స్ గరిష్ట కాంతితో వీడియో ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడంలో సపోర్ట్ చేస్తుంది.

Samsung Galaxy S23 FE డిజైన్ మెటల్, గ్లాస్‌తో వస్తుంది. చేతిలో ఇమిడిపోయేలా స్మూత్‌గా ఉంటుంది. ఫోన్ డైనమిక్ వివిధ రకాల ఆప్షన్లలో ఉంది. మింట్, పర్పల్, గ్రాఫైట్ కలర్స్‌లో ఎంచుకోవచ్చు. అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. గొరిల్లా గ్లాస్ Samsung Galaxy S23 FE డిస్‌ప్లేకు రక్షణగా ఉంటుంది. IP68 ఈ ఫోన్‌లో నీరు గానీ, దుమ్ము ధూళి గానీ చేరకుండా చేస్తుంది. ఫోన్ మన్నికను మరింత పెంచుతుంది. 

Samsung Galaxy S23 FE మన దేశంలో రెండు స్టోరేజ్‌ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. 128 GB ధర రూ.49,999 కాగా.. 256GB ధర రూ.54,999. అయితే Samsung మొబైల్‌పై అప్‌గ్రేడ్ బోనస్ అభిస్తుంది. కొనుగోలుదారులు 24 నెలల తక్కువ ధర ఈఎంఐ ప్లాన్‌ను కూడా ఎంచుకోవచ్చు. కేవలం రోజుకు రూ.67 చెల్లించి మీరు ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అన్ని ఆఫర్స్‌తో కలుపుకుంటే రూ.10 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. 

Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు  

Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News