Samsung Galaxy M04 Price Cut: ఫ్లిప్‌కార్ట్‌ హోలీ ఆఫర్స్..సాంసంగ్‌ Galaxy M04 మొబైల్‌ను ఛీప్‌గా రూ.7,499కే పొందండి..

Samsung Galaxy M04 Price Cut @7,499: అతి తక్కువ ధరకే Samsung Galaxy M04 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? హోలీ సందర్భంగా ఈ మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అతి తక్కువ ధరలోనే విక్రయిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 23, 2024, 01:25 PM IST
Samsung Galaxy M04 Price Cut: ఫ్లిప్‌కార్ట్‌ హోలీ ఆఫర్స్..సాంసంగ్‌ Galaxy M04 మొబైల్‌ను ఛీప్‌గా రూ.7,499కే పొందండి..

Samsung Galaxy M04 Price Cut @7,499: హోలీ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్‌పై ప్రత్యేకమైన డీల్స్‌ ప్రారంభమయ్యాయి. అతి తక్కువ ధరలోనే అన్ని రకాల బ్రాండ్స్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ లభిస్తున్నాయి. అంతేకాకుండా ఇదే సమయంలో ఫ్లిప్‌కార్ట్‌ మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్‌ను కూడా ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా తక్కువ ధరలకే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన మొబైల్స్‌ లభిస్తున్నాయి. మార్చి 30వ తేది వరకు జరిగే ఈ సేల్‌లో భాగంగా ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M04 డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం SAMSUNG Galaxy M04 స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో 4GB ర్యామ్‌, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ వేరియంట్‌ MRP ధర రూ.11,999తో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఫ్లాట్‌ తగ్గింపు కూడా లభిస్తోంది. అయితే సమ్మర్‌ ఫెస్టివెల్‌ డేస్‌ ఎండ్‌ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 37 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఇది రూ.7,499కే అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా అన్ని క్రెడిట్‌ కార్డ్‌పై దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు  ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ వినియోగించి పేమెంట్‌ చేస్తే 5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను EMI ఆప్షన్‌ను చూస్‌ చేసుకుని కొనుగోలు చేసేవారు రూ.257 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

సాంసంగ్‌ గెలాక్సీ M04 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌:
సాంసంగ్‌ గెలాక్సీ M04 స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల HD + LCD ప్యానెల్‌ డిస్ల్పే సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని స్క్రీన్‌ 720x1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో లభిస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్‌లో ర్యామ్ ప్లస్ ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉంది. దీనితో దాదాపు ఈ స్మార్ట్‌ఫోన్‌ ర్యామ్‌ను 8 జీబీ ర్యామ్‌ వరకు పెంచుకోవచ్చు. అలాగే  మెమరీని 1 TB వరకు పెంచుకునే ఫీచర్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ MediaTek Helio P35 చిప్‌సెట్‌పై రన్‌ అవుతుంది. దీంతో పాటు ఇది డబుల్‌ కెమెరా సెటప్‌తో లభిస్తుంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

సాంసంగ్‌ గెలాక్సీ M04 స్మార్ట్‌ఫోన్‌ టాప్‌ 10 ఫీచర్స్‌:
6.5-అంగుళాల HD+ ఇన్ఫినిటి-V డిస్‌ప్లే
720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌
5000mAh శక్తివంతమైన బ్యాటరీ
13MP డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్
13MP ప్రధాన కెమెరా 
2MP డెప్త్ కెమెరా 
5MP సెల్ఫీ కెమెరా
MediaTek Helio G35 ప్రాసెసర్
32GB ఇంటర్నల్ స్టోరేజ్
Android 12 Go Edition ఆపరేటింగ్ సిస్టమ్
4G LTE కనెక్టివిటీ

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News